Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsInternationalLionel Messi | మెస్సీ భార్య సూపర్‌ మార్కెట్‌పై కాల్పులు.. 'మెస్సీ వెయింటింగ్‌ ఫర్‌ యూ'...

Lionel Messi | మెస్సీ భార్య సూపర్‌ మార్కెట్‌పై కాల్పులు.. ‘మెస్సీ వెయింటింగ్‌ ఫర్‌ యూ’ అంటూ బెదిరింపు లేఖ!

Lionel Messi | సాకర్‌ ప్రపంచ కప్‌ అర్జెంటీనాకు అందించిన ఫుట్ బాల్‌ దిగ్గజం లియోనల్ మెస్సీ. అతని భార్యకు చెందిన సూపర్ మార్కెట్‌ పై ఇద్దరు ఆగంతుకులు కాల్పులు జరిపారు. ఈ ఘటన మెస్సీ నివాస ప్రాంతమైన రొసారియోలో జరిగింది. మెస్సీ భార్యకు చెందిన సూపర్‌ మార్కెట్‌ పై గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 14 బుల్లెట్లు కురిపించారు. అంతేకాకుండా మెస్సీని బెదిరిస్తూ రాసిన ఓ లేఖను కూడా అక్కడ వదిలి వెళ్లారు.

” మెస్సీ, మేం మీ కోసం ఎదురు చూస్తున్నాము. జావ్కిన్‌ ఓ నార్కో, అతను మిమ్మల్ని కాపాడలేడు” అని ఆ లేఖలో పేర్కొన్నారు. దుండగులు కాల్పులు జరిపిన సూపర్‌ మార్కెట్‌ మెస్సీ భార్య ఆంటోనెలా రోకుజో కుటుంబానికి చెందినదిగా నగర మేయర్‌ జావ్ కిన్‌ తెలిపారు. ‘ఈ దాడితో నగరంలో గందరగోళం సృష్టించడం తప్పితే వాళ్లకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మెస్సీపై దాడి కంటే ప్రపంచంలో ఏ కథ వేగంగా వైరల్ అవుతుంది? ఇలాంటి ఘటనలు కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి’ అని ఆయన చెప్పారు.

కాగా, అర్ధరాత్రి మూడు గంటల మధ్య ఇద్దరు వ్యక్తులు మోటార్‌బైక్‌పై వచ్చినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఒకరు బైక్ దిగి కాల్పులు జరిపి, నోట్‌ను పడేసి వెళ్లిపోయారని తెలిపారు. ఇది మెస్సీకి బెదిరింపు కాదని, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం అని పోలీసులు చెబుతున్నారు. కాల్పుల సమయంలో సూపర్‌మార్కెట్‌ ఆవరణలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు.

మెస్సీ, రోకుజో కుటుంబానికి ఇదివరకు ఎలాంటి బెదిరింపులు రాలేదన్నారు. కాగా, రోసారియో నగరం పరానా నదిపై ఉన్న ఓడరేవు నగరం. ఇది మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కేంద్రంగా ఉంది. అర్జెంటీనా దేశంలో అత్యంత హింసాత్మక నగరంగా మారింది. 2022లో అక్కడ 287 హత్యలు జరిగాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rahul Gandhi | ఆ సమయంలో నన్ను చంపేసేవారమో.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Emoji | ఎమోజీల ట్రెండ్‌ ఎలా మొదలైంది? అవి పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

First Video on Youtube | యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటో తెలుసా

CRED CEO | ఆ కంపెనీ సీఈవో జీతం కేవలం 15 వేలే.. ఎందుకలా?

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News