Thursday, December 7, 2023
- Advertisment -
HomeEntertainmentNagarjuna | అక్కినేని నాగార్జునకు గోవా సర్పంచ్‌ నోటీసులు.. కారణమిదే..

Nagarjuna | అక్కినేని నాగార్జునకు గోవా సర్పంచ్‌ నోటీసులు.. కారణమిదే..

Nagarjuna | కింగ్‌ నాగార్జునకు గోవాలోని మండ్రెమ్‌ గ్రామ పంచాయతీ షాకిచ్చింది. అశ్వెవాడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 211/2 బిలో ఇటీవల నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ చేపట్టాడు. అయితే వీటికి ఎలాంటి అనుమతులు లేవని.. ఆ నిర్మాణాలను వెంటనే ఆపాలంటూ గ్రామ సర్పంచ్‌ అమిత్‌ సావంత్‌ నోటీసులు జారీ చేశాడు. గోవా పంచాయతీరాజ్‌ చట్టం 1994 కింద ఈ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. అక్రమంగా చేపట్టిన ఈ నిర్మాణాలను వెంటనే ఆపాలని.. లేదంటే గోవా గ్రామ పంచాయతీ రాజ్‌ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నాడు. కాగా ఈ నోటీసులపై నాగార్జున గానీ.. అతని కుటుంబసభ్యులుగానీ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.

నాగార్జున హోస్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఇటీవల ముగిసింది. మూడో సీజన్‌ నుంచి బిగ్‌బాస్‌ షోను విజయవంతంగా నడిపిస్తున్న నాగ్‌.. వచ్చే సీజన్‌ నుంచి కనిపించరని వార్తలు వినిపిస్తున్నాయి. ఆరో సీజన్‌లో ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్‌బాస్‌ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాలు నచ్చలేదని.. అందుకే బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పాలని నాగ్‌ నిర్ణయించుకున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

నాగార్జున స్థానంలో నందమూరి బాలకృష్ణను తీసుకోవాలని నిర్వాహకులు చూస్తున్నారని తెలుస్తోంది. అయితే నాగ్‌ మాత్రం దగ్గుబాటి రానా పేరును సూచించినట్టు ఫిలిం ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. మరి వీరిలో ఎవరు బిగ్‌బాస్‌ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తారనేది చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Laththi Review | లాఠీ సినిమా రివ్యూ.. ఈసారైన విశాల్ హిట్ కొట్టాడా?

Keerthi bhat | ఈ స్థాయికి రావడానికి ఏదో చేసి ఉంటా అనుకున్నాడు.. అనుమానంతో బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కీర్తి ఎమోషన్‌

Kannada actor darshan | తనపై చెప్పు విసరడంపై తొలిసారి స్పందించిన కన్నడ స్టార్ హీరో దర్శన్

Anupama Parameswaran | యాక్టింగ్‌కు లాంగ్‌ గ్యాప్‌ ఇవ్వనున్న అనుపమ.. ఏం చేయబోతుందో తెలుసా

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News