Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsInternationalNewzealand | అటు వరదలు.. ఇటు భూప్రకంపనలు.. తుర్కియే తర్వాత ప్రకృతి ప్రకోపానికి వణికిపోతున్న న్యూజిలాండ్‌

Newzealand | అటు వరదలు.. ఇటు భూప్రకంపనలు.. తుర్కియే తర్వాత ప్రకృతి ప్రకోపానికి వణికిపోతున్న న్యూజిలాండ్‌

Newzealand | ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా దేశాల తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్‌ వణికిపోతుంది. మూడు రోజులుగా వరదల్లో చిక్కుకుపోయిన ఆ దేశాన్ని ఇప్పుడు భూకంపాలు భయపెట్టిస్తున్నాయి. గాబ్రియెల్‌ ( gabrielle ) తుఫాను కారణంగా న్యూజిలాండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నార్త్‌ ఐలాండ్‌, ఆక్లాండ్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. భీకర గాలుల వల్ల భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలమట్టామయ్యాయి. దీంతో వేలాది ఇల్లు చీకట్లో మగ్గుతున్నాయి. ఇలా ఒకవైపు భారీ వరదలు అతలాకుతలం చేస్తున్న ఈ సమయంలో న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది.

New zealand floods earthquake
Image Source : AJ+ Twitter

వెల్లింగ్టన్‌ సమీపంలోని లోయర్‌ హట్‌ ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సెస్మిలాజికల్‌ సెంటర్‌ వెల్లడించింది. 74 కిలోమీటర్ల లోతులో ఇది కేంద్రీకృతమైంది. భూకంపం తర్వాత 15 నిమిషాల్లోనే 31వేల మంది తాము ఉన్న చోట్ల కంపించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 30 సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చాయని తెలిపారు. అయితే భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందా అనే విషయాలను ఇంతవరకు బయటపెట్టలేదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bald Head | బట్టతల ఉంటే చురుగ్గా పనిచేయలేరు.. ఉద్యోగంలో నుంచి పీకేసిన బాస్ !

Aliens | అమెరికా గగనతలంలో ఏలియన్స్ తిరుగుతున్నాయా? వైట్ హౌజ్ ఆసక్తికర ప్రకటన

Viral News | మండపంలో పెళ్లి కొడుకు.. బయట మాజీ లవర్స్.. నీ జీవితం నాశనం కావాల్సిందేనని ధర్నా.. చివరలో అదిరిపోయే ట్విస్ట్

Chicken Price | కేజీ చికెన్‌ ధర రూ.720.. ఆదివారం నాడు భారీగా పెరిగిన ధర

Turkey earthquake | తుర్కియే భూకంపాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్త హెచ్చరిక.. త్వరలో భారత్‌కు కూడా ముప్పే

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News