Friday, March 29, 2024
- Advertisment -
HomeNewsInternationalBald Head | బట్టతల ఉంటే చురుగ్గా పనిచేయలేరు.. ఉద్యోగంలో నుంచి పీకేసిన బాస్ !

Bald Head | బట్టతల ఉంటే చురుగ్గా పనిచేయలేరు.. ఉద్యోగంలో నుంచి పీకేసిన బాస్ !

Bald Head | ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం, బట్టతల. ఈ సమస్య కారణంగా చాలామంది వివక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే నలుగురిలోకి వెళ్లాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. ఆత్మన్యూనత భావంతో బాధపడుతుంటారు. ఇప్పటికే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి బట్టతల కారణంగా ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చింది. బట్టతల ఉన్నవాళ్లు చురుగ్గా పనిచేయలేరు అంటూ అతన్ని జాబ్‌లో నుంచి పీకేశారు. అలా అని అతనేమీ బాధపడుతూ ఇంట్లో కూర్చోలేదులెండీ.. తనపై వివక్ష చూపించినందుకు న్యాయపోరాటం చేసి లక్షల రూపాయల నష్టపరిహారం పొందాడు.

ఇంగ్లండ్‌ లీడ్స్‌లోని టాంగో నెట్‌వర్క్‌లో 61 ఏళ్ల మార్క్ జోన్ సేల్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఆ ఉద్యోగంలో చేరి రెండేళ్లు కూడా కాలేదు. కానీ మార్క్ జోన్ అంటే వాళ్ల మేనేజర్‌ ఫిలిప్ హెస్కెత్‌కు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే తనలాగే మార్క్‌కు బట్టతల ఉంది. తనలాగే 50 ఏళ్లు పైబడి ఉంటాడు. అందుకే తన మిర్రర్ ఇమేజ్‌లా ఉన్న మార్క్‌ను పనిలో నుంచి పీకేయాలని డిసైడ్ అయ్యాడు. బట్టతల ఉన్న వ్యక్తులు చురుగ్గా పనిచేయలేరని.. నువ్వు ఈ జాబ్‌కి సెట్ కావంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. సేల్స్ డైరెక్టర్ పొజిషన్‌కు చురుకైన యువకులే కావాలంటూ మార్క్‌ను ఉద్యోగంలో నుంచి పీకేశాడు.

వివక్ష చూపించి ఉద్యోగంలో నుంచి పీకేయడంతో మార్క్ వెళ్లి సదరు కంపెనీపై దావా వేశాడు. గతంలో టాంగో కంపెనీకి ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు తనతో పాటు ఇద్దరు యువకులు వచ్చారని.. వాళ్ల కంటే మెరుగైన పర్ఫార్మెన్స్ ఉండటంతోనే తనకు ఈ ఉద్యోగం ఇచ్చారని న్యాయస్థానానికి మార్క్ తెలిపాడు. కానీ ఇప్పుడు బట్టతల ఉందనే వివక్షతో పనిచేయడం లేదని ఉద్యోగం మానేసేలా ఒత్తిడి తెచ్చారని విన్నవించారు. వివక్షపూరితంగా ఉద్యోగం తొలగించడంపై న్యాయస్థానం ఆగ్రహించింది. మార్క్‌కు 71 వేల పౌండ్లు అంటే.. దాదాపు 71 లక్షల రూపాయలను మార్క్‌కు నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

AP CM Jagan | 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్ వార్నింగ్.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని హెచ్చరిక

IndiGo | లాభాలు వచ్చాయని.. పైలట్ల జీతాలు పెంచిన ఇండిగో

LTTE Chief Prabhakaran | టైగర్ బతికే ఉన్నారు.. ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌పై నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News