Thursday, June 13, 2024
- Advertisment -
HomeNewsInternationalViral News | మండపంలో పెళ్లి కొడుకు.. బయట మాజీ లవర్స్.. నీ జీవితం నాశనం...

Viral News | మండపంలో పెళ్లి కొడుకు.. బయట మాజీ లవర్స్.. నీ జీవితం నాశనం కావాల్సిందేనని ధర్నా.. చివరలో అదిరిపోయే ట్విస్ట్

Viral News | అందమైన అమ్మాయితో పెళ్లికి రెడీ అయిన ఓ యువకుడికి మాజీ లవర్స్ షాకిచ్చారు. మమ్మల్ని కాదని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావ్ అంటూ అందరూ కలిసొచ్చి మండపం ఎదురుగా ధర్నాకు దిగారు. ఇవాళ నీ జీవితం నాశనం చేయకుండా వదిలిపెట్టమంటూ శపథం కట్టారు.. ఈ హఠాత్పరిణామంతో పెళ్లి కొడుకు బయపడిపోతే.. పెళ్లికూతురు బిత్తరపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక పెళ్లికొచ్చిన బంధువులు గందరగోళానికి గురయ్యారు. చైనాలోని యున్నాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే… యున్నాన్ ప్రావిన్స్‌లో చెన్ అనే యువకుడు టీనేజీలో ఉన్నప్పుడు ప్రేమ పేరుతో పలువురు అమ్మాయిలతో కాలక్షేపం చేశాడు. ఆ తర్వాత వాళ్లను వదిలేశాడు. ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 6న వివాహానికి ఏర్పాట్లు చేశారు. వధూవరులు, కుటుంబసభ్యులు, బంధువులు అంతా మండపం దగ్గరకు చేరుకున్నారు. అంతా కోలహాలంగా ఉన్న సమయంలో అక్కడికి కొంతమంది అమ్మాయిలు వచ్చారు. రాగానే వాళ్లంతా ఒక బ్యానర్‌ను చేతిలో పట్టుకుని నిరసన తెలియజేయడం మొదలుపెట్టారు. ‘మేం మాజీ ప్రియురాళ్లం. ఈ రోజు మేమంతా కలిసి నీ జీవితాన్ని నాశనం చేస్తాం’ అని రాసిన బ్యానర్‌తో మండపం ముందు నిలుచున్నారు.

ఏం జరుగుతుందో కాసేపటి దాకా ఎవరికీ అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని ఇదంతా ఏంటి అని చెన్‌ను నిలదీశారు. దానికి తాను చేసిన తప్పును నిజాయితీగా చెన్ ఒప్పుకున్నాడు. టీనేజీలో ఉన్నప్పుడు మానసిక పరిపక్వత లేక.. తెలిసీ తెలియనితనంతో అమ్మాయిల చుట్టూ తిరిగానని చెప్పాడు. ఇప్పుడు పూర్తిగా మారిపోయానని తెలిపాడు. అందర్నీ ఇబ్బందికి గురిచేసినందుకు క్షమాపణలు చెప్పాడు.

చివర్లో తెలుగు సినిమా స్టైల్‌లో డైలాగ్ వదిలాడు. ‘అమ్మాయిలను మోసం చేయవద్దు. వారిని నిజాయితీగా ప్రేమించాలి. లేదంటే ఆమె ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే భవిష్యత్తులో మీరు బలవుతారు’ అంటూ క్షమాపణలు చెప్పాడు. చెన్ తన తప్పును ఒప్పుకోవడంతో పెళ్లి కూతురు, ఆమె కుటుంబసభ్యులు అతన్ని క్షమించారు. దీంతో మాజీ లవర్స్ కూడా అతన్ని మన్నించారు. చివరకు త్రివిక్రమ్ సినిమా స్టైల్‌లో అందరూ ఆనందంగా చెన్ పెళ్లి జరిపించేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

AP CM Jagan | 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్ వార్నింగ్.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని హెచ్చరిక

IndiGo | లాభాలు వచ్చాయని.. పైలట్ల జీతాలు పెంచిన ఇండిగో

LTTE Chief Prabhakaran | టైగర్ బతికే ఉన్నారు.. ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌పై నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News