Monday, March 27, 2023
- Advertisment -
HomeNewsInternationalAliens | అమెరికా గగనతలంలో ఏలియన్స్ తిరుగుతున్నాయా? వైట్ హౌజ్ ఆసక్తికర ప్రకటన

Aliens | అమెరికా గగనతలంలో ఏలియన్స్ తిరుగుతున్నాయా? వైట్ హౌజ్ ఆసక్తికర ప్రకటన

Aliens | అగ్రరాజ్యం అమెరికా గగనతలంలో అనుమానాస్పద వస్తువుల కదలికలు పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి. పది రోజుల కిందట ఓ స్పై బెలూన్.. రెండు రోజుల కిందట ఓ గుండ్రటి వస్తువు.. ఈ రెండింటినీ పేల్చేయగానే.. ఇంకో వస్తువు గగనతలంలో విహరిస్తూ కనిపించింది. దీంతో ఇది శత్రు దేశాల కుట్రలో భాగమా లేదా గ్రహాంతరవాసుల పనేమో అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏలియన్స్ ఉన్న మాటను కొట్టిపారేయలేమని ఎయిర్‌ ఫోర్స్‌ జనరల్ గ్లెన్‌ వ్యాన్‌ హెర్క్‌ చెప్పిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో అమెరికాలో ఏలియన్స్ తిరుగుతున్నాని ప్రచారం ఎక్కువ కావడంతో వైమానిక దళ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై వైట్ హౌజ్ వివరణ ఇచ్చింది.

” గగనతంలో కనిపించిన వస్తువులు ఏలియెన్స్‌ కు చెందినవా.. కాదా అనే విషయాన్ని కొట్టిపారేయలేం. ఈ విషయాన్ని కౌంటర్‌ ఇంటెలిజెన్స్ నిపుణులు కనుక్కునే పని లో ఉన్నారు. ప్రస్తుతం ఉత్తర అమెరికాకు వీటి వల్ల పొంచి ఉన్న ముప్పును అన్ని రకాలుగా అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతానికి ఆ వస్తువులు ఎలా ఎక్కడి నుంచి వస్తున్నాయో మిలిటరీ ఇంకా గుర్తించలేదు. ఇప్పటికైతే వాటిని బెలూన్లగా పిలవలేం. వస్తువుగానే చూస్తాం” అని ఇటీవల అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ జనరల్ గ్లెన్‌ వ్యాన్‌ హెర్క్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారడంతో వైట్ హౌజ్ స్పందించింది. ఏలియన్లు, యూఎఫ్‌వో వాదనను కొట్టిపారేసింది.

అమెరికా యుద్ద విమానాలు కూల్చిన వస్తువులకు, ఏలియన్స్ కదలికలకు ఎలాంటి సంబంధం లేదని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ ప్రకటించారు. ప్రపంచ దేశాల్లో ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయని.. వారంతా దీనిపై ఆరా తీస్తున్నారని తెలిపారు. కానీ ఇది గ్రహాంతరవాసుల చర్య అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

AP CM Jagan | 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్ వార్నింగ్.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని హెచ్చరిక

IndiGo | లాభాలు వచ్చాయని.. పైలట్ల జీతాలు పెంచిన ఇండిగో

LTTE Chief Prabhakaran | టైగర్ బతికే ఉన్నారు.. ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌పై నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News