Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsIndiGo | లాభాలు వచ్చాయని.. పైలట్ల జీతాలు పెంచిన ఇండిగో

IndiGo | లాభాలు వచ్చాయని.. పైలట్ల జీతాలు పెంచిన ఇండిగో

IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా నష్టపోవడంతో కొంతకాలంగా జీతాల పెంపును ఆపేసిన ఇండిగో.. ఇప్పుడు లాభాలు రావడంతో జీతాలు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో నిలిపివేసిన పైలట్ల వేతనాల్లో వార్షిక పెంపు ప్రక్రియను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

కొవిడ్‌ మహమ్మరి దేశంలో విలయ తాండవం చేస్తున్న సమయంలో దేశంలో ఉన్న అన్ని పరిశ్రమలు దాదాపు మూతపడ్డాయి. వ్యాపారాలు నిలిచిపోయాయి. ప్రజలకు బతకడం కూడా కష్టమైపోయింది. ఏం చేయాలో తెలియక ఇంట్లో నుంచి బయటకు రాలేని వారు ఎందరో. అలా ప్రభావితం చెందిన రంగాల్లో ముఖ్యంగా ఉన్న ఒక సంస్థ విమానయాన సంస్థ. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోయిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్నాయి. ప్రస్తుతం విమానయానం కరోనా ముందు ఉన్న పరిస్థితులకు చేరుకుంటుంది. దీంతో విమానయాన సంస్థలు ఆర్థికంగా పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇండిగో సంస్థ మూడో త్రైమాసికంగా ఏకంగా రూ.1,422 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఆదాయం కూడా 60 శాతానికి పెరిగి రూ.14,933 కోట్లకు చేరింది.

భారీగా లాభాలు పెరగడంతో పైలట్ల వేతన వార్షిక పెంపు ప్రక్రియను పునరుద్ధరిస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏప్రిల్ నుంచి ఈ వేతనాల పెంపును అమలు చేస్తామని ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం అందించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Turkey earthquake | తుర్కియే భూకంపాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్త హెచ్చరిక.. త్వరలో భారత్‌కు కూడా ముప్పే

Tarakarathna | తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తున్నారా? నందమూరి కుటుంబసభ్యులు ఇచ్చిన హెల్త్ అప్‌డేట్ ఇదీ

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News