Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsBirth day | భార్య పుట్టిన రోజు మరిచిపోతే ఐదేళ్ల జైలు శిక్ష.. ఈ వింత...

Birth day | భార్య పుట్టిన రోజు మరిచిపోతే ఐదేళ్ల జైలు శిక్ష.. ఈ వింత చట్టం గురించి తెలుసా !

Birth day | చాలామంది భర్తలు కామన్‌గా చేసే పనే ఇది ! వర్క్ బిజీలోనో.. ఫ్యామిలీ టెన్షన్స్‌లోనో భార్య పుట్టిన రోజును మరిచిపోతుంటారు. భార్య బర్త్ డే సెలబ్రేట్ చేయడం అటుంచితే కనీసం విష్ కూడా చేయరు. దీంతో అర్ధాంగి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇది ఆలుమగల మధ్య పెద్ద గొడవకే దారితీస్తుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది. మళ్లీ ఎప్పటిలా ఉండిపోతారు. కానీ భార్య పుట్టిన రోజు మరిచిపోతే దాన్ని పెద్ద నేరంగా పరిగణించి 5 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారని తెలుసా ! కంగారు పడకండి.. ఇది మన దేశంలో కాదు.. ప్రకృతి సౌందర్యాలకు ప్రసిద్ధి చెందిన సమోవా దేశంలో.

సమోవా దేశంలోని చట్టాల ప్రకారం భార్య బర్త్ డే మరిచిపోతే మొదటి సారి వార్నింగ్ ఇస్తారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకూడదని హెచ్చరిస్తారు. కానీ రెండోసారి కూడా మరిచిపోతే ఇక అంతే! సదరు భర్తకు జరిమానా గానీ.. జైలు శిక్ష గానీ విధిస్తారు. దాదాపు ఐదేళ్ల వరకు కూడా కారాగారంలో గడపాల్సి ఉంటుంది. ఇదేదో నామమాత్రంగా ఉన్న చట్టం అస్సలు కాదు. దీన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ను కూడా సమోవా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో పోలీస్ అధికారి స్థాయి వ్యక్తి నేతృత్వంలో ఈ టీమ్ నడుస్తుంది.

ఎవరైనా తన భర్త బర్త్ డే విషెస్ చెప్పాలేదని ఫిర్యాదు చేస్తే.. ఈ స్పెషల్ టీమ్ వెంటనే రంగంలోకి దిగుతుంది. తగు చర్యలు తీసుకుంటుంది. వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడమే కాదు.. వీళ్లు మధ్య మధ్యలో అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ చట్టం గురించి మహిళలకు వివరిస్తూ ఉంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Turkey earthquake | తుర్కియే భూకంపాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్త హెచ్చరిక.. త్వరలో భారత్‌కు కూడా ముప్పే

Tarakarathna | తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తున్నారా? నందమూరి కుటుంబసభ్యులు ఇచ్చిన హెల్త్ అప్‌డేట్ ఇదీ

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News