Home Latest News Rain alert | వాతావరణ శాఖ అలర్ట్.. మాండౌస్ నుంచి తేరుకోకముందే ముంచుకొస్తున్న మరో తుఫాను

Rain alert | వాతావరణ శాఖ అలర్ట్.. మాండౌస్ నుంచి తేరుకోకముందే ముంచుకొస్తున్న మరో తుఫాను

Rain alert | మాండౌస్ తుఫాను ప్రభావంతో ఉత్తర తమిళనాడుతో పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో అన్నమయ్య జిల్లాతో పాటు చెన్నై తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.అయితే మాండౌస్ తుఫాను నుంచి తేరుకోకముందే మరో తుఫాను ముంచుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ ప్రాంతంలో మంగళవారం ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి తర్వాత క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 16వ తేదీ నాటికి మరింత బలపడి తుఫానుగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు శ్రీలంక సమీపంలో సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సోమ, మంగళ వారాల్లో లక్షదీవులు, కేరళ, కర్నాటక కోస్తా తీర ప్రాంత జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చిరించింది. మాండౌస్ ప్రభావంతో అరేబియా సముద్రంలో గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Beauty tips for lips | చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Exit mobile version