Home Entertainment Anupama Parameswaran | అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎందుకు...

Anupama Parameswaran | అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎందుకు కాలేకపోయింది?

Anupama Parameswaran | చూడచక్కని రూపం.. చక్కటి అభినయం మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ సొంతం. కర్లీ హెయిర్‌తో ముద్దుముద్దుగా కనిపించే ఈ కేరళ కుట్టి.. తొలి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా తర్వాత అనుపమకు ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రతి సినిమాలోనూ తన యాక్టింగ్‌తో మెస్మరైజ్‌ చేసింది. అయినా ఆమె స్టార్‌ హీరోయిన్ కాలేకపోయింది. తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన సాయిపల్లవి, రష్మిక మంధన, పూజా హెగ్డే వంటి హీరోయిన్లు స్టార్‌ స్టేటస్‌ అనుభవిస్తుంటే.. తను మాత్రం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిలో ఉంది. దీనంతటికీ కారణం ఏంటి? అంటే స్వయంకృత అపరాధమే అని చెప్పాలి.

కెరీర్‌ తొలినాళ్లలో వరుస ఆఫర్లు వచ్చినప్పుడు ఆచితూచి సినిమాలను ఎంచుకోవడంలో పొరపాట్లు బాగానే చేసింది. సెకండ్‌ హీరోయిన్‌ రోల్స్‌ చేయడం, పెద్దగా ఇంపార్టెంట్‌ లేని క్యారెక్టర్స్‌కి ఓకే చెప్పడమే అనుపమ కెరీర్‌కు శాపంగా మారింది. అవికాకుండా ప్రతి సినిమాలోనూ ఒకే విధమైన పాత్రలు చేయడం కూడా కెరీర్‌ను చాలా దెబ్బతీసింది. దీనివల్ల ఆడియన్స్‌కు కనెక్ట్‌ కావాల్సిన అనుపమ.. వాళ్లకు దూరమైపోయింది. ఫలితంగా ఆమె క్రేజ్‌ చాలా తగ్గిపోయింది. అదే టైమ్‌లో వచ్చిన యంగ్ హీరోయిన్లు యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఈ రీజన్‌ వల్ల స్టార్‌ హీరోలు అనుపమను హీరోయిన్‌గా తీసుకోవడానికి అంతగా ఇష్టపడటం లేదు. దీంతో అనుపమకు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతుంది. మొన్నటికి మొన్న అనుపమ నటించిన కార్తికేయ2 సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారతీయ చిత్రసీమ మొత్తం ఈ సినిమాకు నీరాజనం పలికింది. కానీ ఇందులో హీరోయిన్‌గా నటించిన అనుపమకు మాత్రం ఒరిగిందేమీ లేదు. ఆమె పాత్ర గురించి మాట్లాడిన వాళ్లు కూడా లేరు.

కెరీర్‌ తొలినాళ్ల నుంచి ఒకే తరహా పాత్రలు ఎంచుకోవడం వల్ల అనుపమ కెరీర్‌ డైలామాలో పడిపోయింది. మొదట్లో స్కిన్‌ షోకి ఒప్పుకోకపోవడం కూడా మైనస్సే అని చెప్పాలి. ఇప్పుడు స్కిన్‌ షో చేసేందుకు సిద్ధమని హింట్‌ ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ మధ్య దిల్‌ రాజు అన్న కొడుకు ఆశిష్‌ హీరోగా వచ్చిన రౌడీబాయ్స్‌ సినిమాలో తాను పెట్టుకున్న గీత దాటేసింది. లాంఛింగ్‌ హీరోతో లిప్‌లాక్‌ సీన్స్‌లో కూడా నటించింది. కానీ లాభం లేకుండాపోయింది. ముందు నుంచి ట్రెడిషనల్‌గా కనిపించిన అనుపమను.. గ్లామర్‌ పాత్రల్లో చూసేందుకు ఆడియన్స్‌ ఇష్టపడట్లేదు. డీజే టిల్లు సీక్వెల్‌లో వచ్చిన ఆఫర్‌ చేజారిపోవడానికి కూడా ఇదే కారణమని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మిగతా హీరోయిన్లలా ఎక్కువ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేయకపోయినా సరే.. కెరీర్‌ మొదట్లో చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు అనుపమను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో 18 పేజేస్‌, బటర్‌ఫ్లై తెలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు అయినా అనుపమ కెరీర్‌ను గాడిలో పడేస్తాయో లేదో చూడాలి..

Follow Us : FacebookTwitter

Read More Articles |

Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా పవర్ స్టార్

Movie Ticket Only for One rupee | హైదరాబాదీలకు బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయికే సినిమా టికెట్‌.. నో కండీషన్స్‌

Keerthy Suresh | తెలుగు ఇండస్ట్రీపై ‘మహానటి’కి కోపం వచ్చిందా ? ఆ సినిమా కీర్తి సరేశ్‌ కెరీర్‌కు మైనస్‌ అయిందా ?

Exit mobile version