Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsRahul Gandhi | నాకు పిల్లలు కావాలని ఉంది.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్...

Rahul Gandhi | నాకు పిల్లలు కావాలని ఉంది.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rahul Gandhi | ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రాహుల్ గాంధీ. ఐదు పదుల వయసు దాటినా ఇంకా రాహుల్ పెళ్లి చేసుకోకపోవడంపై తరచూ ఏదో ఓ చర్చ జరుగుతూనే ఉంది. రాహుల్ పెళ్లి గురించి ఆయన తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రమే కాదు.. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ రాహుల్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో మాత్రం ఎవరికీ తెలియదు. అయితే దీనిపై తాజాగా రాహుల్ గాంధీ నోరు విప్పారు. ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, పిల్లలపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఐదు పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదని ఇటాలియన్ డైలీ విలేకరి అడగ్గా.. ఆ విషయం తనకు కూడా తెలియదని సమాధానమిచ్చాడు. పెళ్లి చేసుకోకుండా ఉండటంపై ఒక్కోసారి తనది తనకే విచిత్రంగా అనిపిస్తుందని తెలిపారు. అయితే తనకు పిల్లలు కావాలని ఉందని మాత్రం చెప్పారు. ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా రాహుల్ గాంధీకి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. అప్పుడు సరైన అమ్మాయి దొరికితే కచ్చితంగా చేసుకుంటానని రాహుల్ గాంధీ చెప్పారు. అంతేకాదు తనకు ఎలాంటి అమ్మాయి కావాలో కూడా వివరించారు.

తను పెళ్లి చేసుకునే అమ్మాయికి ప్రేమించే వ్యక్తి అయ్యి ఉండాలని, ఇంటెలిజెంట్ అయ్యి ఉండాలని రాహుల్ గాంధీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు తన తల్లి సోనియా గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ ఇద్దరి లక్షణాలు ఉన్న అమ్మాయి అయితే ఇంకా బెటర్ అని చెప్పుకొచ్చాడు. అప్పుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ.. పిల్లలు కావాలని ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఇక ఇటాలియన్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గడ్డం మీద కూడా రాహుల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర పూర్తయ్యే దాకా గడ్డం తీయకూడదని ముందు అనుకున్నానని తెలిపారు. అయితే ఇప్పుడు యాత్ర పూర్తయ్యిందని.. కానీ ఇప్పుడు గడ్డం తీయాలా? వద్దా అనేది మాత్రం నిర్ణయించుకోలేకపోతున్నా అని చెప్పారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ram Charan | అమెరికాలోనూ అయ్యప్ప మాల.. రామ్ చరణ్ ట్రెండింగ్ గురూ..!

Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News