Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentHansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

Hansika Motwani | బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన హన్సిక.. 15 ఏళ్లకే హీరోయిన్‌గా మారింది. దేశముదురు సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అప్పట్లో హన్సికను చూసి అంతా షాకయ్యారు. నిన్న మొన్నటి దాకా చిన్న పిల్లలా కనిపించిన హన్సిక అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా? అంటూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే హన్సికపై పలు వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. కొయి మిల్ గయా సినిమా తర్వాత హన్సికకు వరుస ఆఫర్లు క్యూ కట్టడంతో ఆమె తొందరగా పెద్ద మనిషి కావాలని వాళ్ల అమ్మ హార్మోన్స్ ఇంజెక్షన్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటివరకు హన్సిక కానీ.. ఆమె కుటుంబసభ్యులు కానీ నోరు మెదపలేదు. రీసెంట్‌గా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన హన్సిక.. ఈ పుకార్లపై స్పందించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న లవ్ షాదీ డ్రామా సిరీస్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చింది.

తనకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు త్వరగా పెరిగేందుకు హార్మోన్ ఇంజెక్షన్ తీసుకున్నానని వదంతులు సృష్టించారని చెప్పిన హన్సిక.. వాటిలో నిజం లేదని స్పష్టం చేసింది. తనకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ వార్తలు ఎక్కువగా వచ్చాయని.. మా అమ్మే ఈ హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చిందని ప్రచారం చేశారని బాధపడింది. అది నిజమని ఎలా భావించారో అర్థం కావడం లేదని వాపోయింది. అప్పట్లో ఇవి తీసుకుని ఉంటే.. ఇప్పటికీ తీసుకోవాల్సి ఉండేదని చెప్పుకొచ్చింది. ఈ వార్తలపై హన్సిక మోత్వానీ తల్లి కూడా స్పందించింది.

నిజంగా నా బిడ్డకు హార్మోనల్ ఇంజెక్షన్ ఇచ్చి ఉంటే ఈ పాటికి టాటా, బిర్లా కంటే ధనవంతురాలినై ఉండేదాన్ని అంటూ హన్సిక తల్లి మండిపడింది. టాటా, బిర్లా అంత కాకపోయినా కనీసం మిలియనీర్‌ను అయినా అయ్యి ఉండేదాన్ని కదా అని ప్రశ్నించింది. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తొందరగా పెద్దగా అవ్వడానికి నా దగ్గరికి వచ్చేవాళ్లని చెప్పుకొచ్చింది. ఇలాంటి వదంతులు ఎలా పుట్టిస్తారని మండిపడింది. వాళ్లకు అస్సలు కామన్ సెన్స్ ఉండదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము పంజాబీలం అని.. 12 నుంచి 16 ఏళ్ల వయసులోనే పంజాబీ ఆడపిల్లలు తొందరగా ఎదుగుతారని స్పష్టం చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

BRS MLA Sayanna | బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..

Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News