Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentDadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా,...

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Dadasaheb Phalke Awards 2023 | సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత సినిమా అవార్డుల్లో దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్‌ ఒకటి. ప్రతి సంవత్సరం ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా 2022లో విడుదలైన సినిమాలకు గానూ అవార్డులను అందించారు. ఈ అవార్డుల కార్యక్రమం సోమవారం సాయంత్రం ముంబైలో జరిగింది.

దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ అవార్డ్స్‌ కార్యక్రమానికి అవార్డు గ్రహీతలతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. దక్షిణాది నుంచి దుల్కర్‌ సల్మాన్‌, నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి ఇతర తారలు ఈ వేడుకకు హాజరయ్యారు.

2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రం కాంతారాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన నటుడు, చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టి , ఆ చిత్రంలో తన నటనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్‌లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డును పొందారు. బెస్ట్‌ విలన్ పాత్రకు గానూ దుల్కర్‌ సల్మాన్‌ ఈ అవార్డును అందుకున్నారు.

పాన్-ఇండియన్ స్టార్ 2022లో విడుదలై ప్రశంసలు పొందిన బాలీవుడ్ చిత్రం చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌లో తన నటనకు ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. ఆర్ బాల్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ కొంచెం నెగిటివ్ స్టేట్స్ లో కనిపిస్తారు.

ఇక బెస్ట్ ఫిలింగా కాశ్మీర్ ఫైల్స్ కి రాగా ఫిలిం ఆఫ్ ద ఇయర్ గా మన రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ కి అవార్డు వచ్చింది.

  • ఉత్తమ చిత్రం : ది కాశ్మీర్ ఫైల్స్
  • ఉత్తమ దర్శకుడు: ఆర్ బాల్కీ (చుప్)
  • ఉత్తమ నటుడు: రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర)
  • ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కతియావాడి)
  • మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(రిషబ్ శెట్టి)
  • ఉత్తమ వెబ్ సిరీస్ : రుద్ర,
  • క్రిటిక్స్ ఉత్తమ నటుడు: వరుణ్ ధావన్ (భేడియా),
  • ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: RRR,
  • టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ : అనుపమ
  • మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అఫ్ ది ఇయర్ : అనుపమ్ ఖేర్ (ది కాశ్మీర్ ఫైల్స్),
  • బెస్ట్ టీవీ యాక్టర్ : జైన్ ఇమామ్,
  • బెస్ట్ మేల్ సింగర్ : సచేత్ టాండన్ (మయ్యా మైను – జెర్సీ), బెస్ట్‌ ఫీమేల్ సింగర్ : నీతి మోహన్ ( మేరీ జాన్ – గంగూబాయి కతియావాడి),
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్: PS వినోద్ (విక్రమ్ వేద)
  • సినీ పరిశ్రమలో అత్యుత్తమ సహకారం అందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ఈ ఏడాదికి గానూ రేఖ అందుకున్నారు.
  • సంగీత పరిశ్రమలో అత్యుత్తమ సేవలందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును ఈ ఏడాదికిగానూ హరిహరన్ దక్కించుకున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News