Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentViral News | మనిషి మరణించాకే ప్రేమొస్తుందా.. బతికున్నపుడు ఎక్కడున్నాయ్ ఈ గొప్పలు..?

Viral News | మనిషి మరణించాకే ప్రేమొస్తుందా.. బతికున్నపుడు ఎక్కడున్నాయ్ ఈ గొప్పలు..?

Viral News | నిజంగానే ఒక మనిషి బతుకునప్పుడు ఆయన గురించి గొప్పలు చెప్పడానికి ఎవరో ముందుకు రారు. అలా చెప్పాలి అంటే కచ్చితంగా ఆయన గొప్పోడు అయి ఉండాలి.. లేదంటే అతడితో పొగిడే వాళ్లకు ఏదైనా అవసరమైనా ఉండి ఉండాలి. తమకు లాభం లేకుండా పక్క వాడికి భజన చేసే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో అసలు ఉండరు.

ఇప్పుడు కూడా ఇలాంటిదే జరుగుతుంది. మనుషులు బతికి ఉన్నప్పుడు వాళ్ల గురించి ఎవరూ పట్టించుకోరు.. కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం వచ్చి వాళ్ళు గొప్ప వాళ్ళు.. అద్భుతమైన వాళ్ళు.. చాలా మంచి వాళ్ళు.. అంటూ మీడియా ముందు ముసలి కన్నీరు కార్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోతుంది అంటూ సోషల్ మీడియాలో సినిమా వాళ్లపై విమర్శల వర్షం కురుస్తుంది.

దానికి తాజాగా తారకరత్న ఎపిసోడ్ నిదర్శనంగా నిలిచింది. కేవలం 39 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఈయన హఠాన్మరణం చెందడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన ఉన్నప్పుడు తనకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఎంతో మంది దర్శకులను అడిగాడు. నందమూరి వంశం నుంచి వచ్చినా కూడా ఏ రోజు హీరోగా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోయాడు తారకరత్న.

కనీసం నటుడిగా అయినా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతోమంది తెలిసిన దర్శక నిర్మాతలను అవకాశాల కోసం అడిగాడు. అయితే అక్కడి నుంచి ఏ ఒక్కరు కూడా స్పందించలేదు.. ఏ నిర్మాత ఆయనతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఇక ఇండస్ట్రీలో తనకు అవకాశాలు ఇచ్చే వాళ్ళు లేరని రాజకీయాల వైపు అడుగులు వేశాడు తారకరత్న. కానీ ఆయన ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు అన్నట్టు.. రాజకీయాల్లో బిజీ అవుదాం అని తొలి అడుగు వేస్తున్న రోజుల్లోనే గుండెపోటుతో ఆయన బలైపోయాడు.

అతన్ని కడసారి చూడడానికి వచ్చిన ఇండస్ట్రీ వాళ్ళు.. తారకరత్న గొప్ప నటుడని.. ఇంత చిన్న వయసులో అతడిని కోల్పోవడం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ కబుర్లు చెప్పారు. ఒకవేళ నిజంగా ఆయన అంత గొప్ప నటుడు అయితే.. కనీసం విలన్ క్యారెక్టర్స్ అయినా ఇచ్చిండొచ్చు కదా అని అడుగుతున్నారు నెటిజన్స్. అమరావతి సినిమాలో ఉత్తమ ప్రతి నాయకుడిగా నంది అవార్డు అందుకున్నాడు తారకరత్న.

అయినా కూడా ఆ తర్వాత ఆయనకు ఆశించిన క్యారెక్టర్స్ రాలేదు. అలాంటిది ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వచ్చి ఒక గొప్ప నటుడిని కోల్పోయామంటూ కబుర్లు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ విమర్శలు వస్తున్నాయి.
ఇది కేవలం తారకరత్న విషయంలో మాత్రమే కాదు.. గతంలో ఉదయ్ కిరణ్ విషయంలోనూ ఇదే జరిగింది. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం అందరికీ తెలుసు.

కానీ ఆయన చనిపోయిన రోజు చాలా మంది దర్శక నిర్మాతలు వచ్చి.. నేను ఛాన్స్ ఇద్దాం అనుకున్న.. త్వరలోనే మా సినిమా మొదలుపెడదాం అనుకున్నాం అంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయినప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.

బతికున్నప్పుడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అందరినీ వేడుకున్నాడు సుశాంత్. తీరా ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాక.. అరెరే మేము అవకాశం ఇవ్వాలనుకున్నాము.. అంతలోనే చనిపోయాడు అంటూ కబుర్లు చెప్పారు. మనుషులు బతికున్నప్పుడు వాళ్ల గురించి ఎవరు మాట్లాడకుండా.. చచ్చిపోయిన తర్వాత ఇలాంటి దొంగ ప్రేమలు నటించడం కేవలం సినిమా వాళ్లకు మాత్రమే చెల్లింది అంటూ ఛీ కొడుతున్నారు కామన్ జనం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ram Charan | అమెరికాలోనూ అయ్యప్ప మాల.. రామ్ చరణ్ ట్రెండింగ్ గురూ..!

Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News