Monday, April 15, 2024
- Advertisment -
HomeLatest NewsCM KCR | నా జీవితమంతా పోరాటాలే.. ఎమోషనల్ అయిన సీఎం కేసీఆర్

CM KCR | నా జీవితమంతా పోరాటాలే.. ఎమోషనల్ అయిన సీఎం కేసీఆర్

CM KCR | గెలవాలంటే చిత్తశుద్ధి ఉండాలని.. తలచుకుంటే కానిది ఏదీ ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. పరిష్కారం లేని సమస్య ఉంటూ ఉండదని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర రైతు సంఘాల నేతలో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశానని తెలిపారు. తన జీవితమంతా పోరాటాలే అని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. తెలంగాణలో ఏం చేశామో మీరంతా ఒకసారి చూడాలని మరాఠా రైతు నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని కోరారు.

దేశ రాజధానిలో 13 నెలల పాటు రైతులు పోరాడారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించారని గుర్తు చేశారు. 750 మంది రైతులు చనిపోతే ప్రధాని మోదీ కనీసం స్పందించలేదని అన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులను ఉగ్రవాదులు అని.. ఖలీస్తానీలు అని.. వేర్పాటు దారులు అని ఆరోపించారని అన్నారు. చివరకు రైతుల పోరాటంతో మోదీ దిగొచ్చి క్షమాపణలు చెప్పారన్నారు. అది కూడా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు లేకపోయి ఉంటే సాగు చట్టాలను వెనక్కి తీసుకునేవాళ్లు కాదని అన్నారు.

దేశంలో దేనికి కొదవ లేదని.. అయినప్పటికీ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుల గోస చూసి తనకు కన్నీళ్లు ఆగలేదని అన్నారు. అందుకే తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేశాక ఇక్కడ రైతుల ఆత్మహత్యలు ఆగాయని పేర్కొన్నారు. దేశమంతటా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం రైతు సంఘటిత శక్తిని ఏకం చేయాలని పిలుపునిచ్చారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IPL 2023 | అట్టహాసంగా ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు.. సందడి చేసిన తమన్నా, రష్మిక మందానా.. హోరెత్తిన తెలుగు పాటలు

Gwyneth Paltrow | ఏడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి ఒక్క డాలర్‌ పరిహారం పొందిన ఐరన్‌ మ్యాన్‌ హీరోయిన్‌.. కేసు గెలిచినందుకు ఫుల్‌ హ్యాపీ

Virus Alert | ఆఫ్రికాలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లో ముక్కు నుంచి తీవ్ర రక్తస్త్రావం.. ముగ్గురు మృతి

Mosquito Coil | ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. ఢిల్లీలో దారుణం

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News