Thursday, December 7, 2023
- Advertisment -
HomeNewsInternationalDonkey gift | పెళ్లికూతురికి గాడిదను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. కారణమేంటి?

Donkey gift | పెళ్లికూతురికి గాడిదను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. కారణమేంటి?

Donkey gift | అమ్మాయిలకు గిఫ్ట్‌ ఇవ్వాలంటే మీరైతే ఏమిస్తారు? కామన్‌గా ఎవరైనా సరే పువ్వులు లేదా చాక్లెట్లు ఇచ్చి ఇంప్రెస్‌ చేస్తారు. కొంచెం కాస్ట్‌లీగా ఆలోచిస్తే మొబైల్‌ ఫోన్లు, బంగారు నగలు ఇచ్చి వాళ్లను ఆకట్టుకుంటారు. కానీ ఓ పాకిస్థాన్‌ వరుడు.. తనకు కాబోయే భార్యకు ఇచ్చిన బహుమతి చూస్తే మాత్రం కచ్చితంగా షాకవుతారు. ఇదేంటి అమ్మాయిలకు ఎవరైనా ఇలాంటి గిఫ్ట్‌ ఇస్తారా అని నోరెళ్లబెడతారు. ఇంతకీ అతను ఏమిచ్చాడని అనుకుంటున్నారా? ఒక గాడిద ( Donkey gift ) పిల్లను తీసుకొచ్చి పెళ్లి వేడుకలోనే కానుకగా ఇచ్చాడు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? మీరే కాదు పెండ్లికి వచ్చిన అతిథులందరూ షాకయ్యారు. కానీ తనకు కాబోయే వాడు ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి ఆ పెళ్లి కూతురు మాత్రం తెగ మురిసిపోయింది.

ఇంతకీ విషయమేంటంటే.. పాకిస్థాన్‌కు చెందిన యూట్యూబర్‌ అజ్లాన్‌ షాకు వరిషా జావెద్‌ ఖాన్‌ అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఆమె ఒక జంతు ప్రేమికురాలు. ఈ విషయం తెలిసిన అజ్లాన్‌.. తనకు కాబోయే భార్యకు ఆమెకు నచ్చిన బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. అందుకే తమ పెండ్లి వలీమా రిసెప్షన్‌ సందర్భంగా వరిషాను సర్‌ప్రైజ్‌ చేయాలని అనుకున్నాడు. అందుకే చిన్నగా క్యూట్‌గా ఉన్న గాడిద పిల్లను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ గాడిద పిల్లను చూడగానే ఆమె తెగ సంబరపడిపోయింది. దాన్ని దగ్గరకు తీసుకుని హత్తుకుంది. బుల్లి గాడిద పిల్లతో కాసేపు సరదాగా గడిపింది. తనకు కాబోయే భార్య జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసినప్పుడు ఏదో ఒక జంతువును ఇవ్వొచ్చు కదా? గాడిదనే ఎందుకు ఇచ్చాడని డౌట్‌ వచ్చిందా? ఇదే సందేహం ఆ వధువుకు కూడా వచ్చింది. అందుకే వలీమా రిసెప్షన్‌లోనే పెళ్లి కొడుకును అడిగేసింది. దానికి అజ్లాన్‌ కూడా ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత కష్టపడే, అత్యంత ప్రేమగా ఉండే జంతువు గాడిదనే అని చెప్పాడు. అందుకే గాడిదను కానుకగా ఇచ్చానని బదులిచ్చాడు.

తన భార్య సంతోషం కోసం గాడిద పిల్లను తల్లి నుంచి దూరం చేయడం కూడా అజ్లాన్‌కు నచ్చలేదు. అందుకే గాడిద పిల్లతో పాటు తల్లి గాడిదను కూడా తమతోనే ఉందని అజ్లాన్‌ తెలిపాడు. ఇలా తనకు కాబోయే భార్యకు అపురూపమైన గిఫ్ట్‌ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Interesting facts | కాకి తలపై తన్నితే అపశకునమా.. మరణం తప్పదా? సైన్స్ ఏం చెబుతోంది?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Aadhar Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News