Home News International Fog Effect | పొగమంచు ఎఫెక్ట్.. ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి, 22...

Fog Effect | పొగమంచు ఎఫెక్ట్.. ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి, 22 మందికి గాయాలు

Fog Effect | పొగమంచు కారణంగా చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించనంతగా పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒకదానికి ఒకటి పలు వాహనాలు ఢీ కొనడంతో 17 మంది మృతి చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌ నాన్‌చాంగ్ కౌంటీలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పొగమంచు కారణంగా రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయని, ఇటీవలి కాలంలో ఈ తరహా రోడ్డు ప్రమాదాల్లో ఇదే పెద్దదని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎన్ని వాహనాలు ప్రమాదానికి గురయ్యాయనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు తెలిపారు. జియాంగ్జీ ప్రావిన్స్‌లో భారీగా పొగ మంచు కమ్ముకుందని వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓవర్ టేక్ చేయొద్దంటూ సూచించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Roja Vs Nagababu | జబర్దస్త్ మాజీ జడ్జీల మధ్య మాటల యుద్ధం.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది.. నాగబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

Weather Report | గజగజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ.. మరో 4 రోజులు ఇదే పరిస్థితి!

Viral News | నాకు కేన్సర్ అని అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్.. డాక్టర్‌ను వేడుకున్న ఆరేళ్ల బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వైద్యుడి ట్వీట్!

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Exit mobile version