Home Entertainment Adivi sesh | ఒక్కో ఫ్యామిలీ నుంచి 10 మంది హీరోలు ఉంటే.. ఛాన్స్‌లు ఎలా...

Adivi sesh | ఒక్కో ఫ్యామిలీ నుంచి 10 మంది హీరోలు ఉంటే.. ఛాన్స్‌లు ఎలా వస్తాయి.. అడవి శేష్ సెన్సేషనల్ కామెంట్స్

Adivi sesh | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకుంటున్నాడు అడవి శేష్. హీరో అవుదామని వచ్చినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేశాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా అవకాశాలను దక్కించుకుంటూ తన లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు. ఇప్పుడు వరుస సక్సెస్‌లు అందుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీపై అడవి శేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

సినీ ఇండస్ట్రీల్లో వారసులను దాటుకుని బయటివారికి అవకాశాలు రావడం చాలా కష్టమైన పని. ఈ విషయం అందరికీ తెలిసిన రహస్యమే. ఇప్పుడు దీనిపైనే అడవి శేష్ ఓపెన్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఒక్కో ఫ్యామిలీ నుంచి 10 మంది హీరోలు ఉంటారని.. వాళ్లను దాటుకుని మంచి స్క్రిప్ట్ మన దగ్గరకు రావడం కష్టమని చెప్పుకొచ్చాడు. తెలుగు సినిమాల్లో ఆడిషన్ కల్చర్ కూడా లేదని పేర్కొన్నాడు. సినిమాల్లోని లీడ్ రోల్స్‌తో పాటు ముఖ్యమైన పాత్రలు అన్నింటినీ ముందుగానే సెలెక్ట్ చేస్తారని తెలిపారు. ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్రలకు మాత్రమే ఇక్కడ ఆడిషన్స్ ఉంటాయని చెప్పాడు.

ఇక్కడ లీడ్ రోల్ దక్కాలంటే సొంతంగా కథలు రాసుకోవడమే ఏకైక ఆప్షన్ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకే అన్నీ తెలుసని ఎప్పుడూ అనుకోనని అడవి శేష్ చెప్పాడు. ఫెయిల్ అయితే డిప్రెషన్‌లోకి వెళ్లనని.. ఫెయిల్యూర్‌కు గల కారణాలను విశ్లేషించుకుని పాజిటివ్‌ దృక్ఫథంతో ముందుకెళ్తానని చెప్పాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sreeleela | సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల.. కారణం అదేనా?

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

Exit mobile version