Monday, April 15, 2024
- Advertisment -
HomeNewsInternationalAfridi Marriage | ఒక ఇంటివాడైన అఫ్రిది.. దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురితో ‘నిఖా’

Afridi Marriage | ఒక ఇంటివాడైన అఫ్రిది.. దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురితో ‘నిఖా’

Afridi Marriage | టైమ్‌ 2 న్యూస్‌, కరాచీ: అంతర్జాతీయ క్రికెట్‌లో తన వేగంతో ప్రత్యర్థికి ముచ్చమటలు పట్టిస్తున్న పాకిస్థాన్‌ ఏస్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది ఓ ఇంటివాడయ్యాడు. పాకిస్థాన్‌ జట్టుకు ఇప్పట్లో అంతర్జాతీయ సిరీస్‌లు లేకపోవడంతో షాహీన్‌ పెళ్లీ పీటలెక్కాడు. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌ రౌండర్‌, ‘బూమ్‌ బూమ్‌’ అఫ్రిది కూతురితో షాహీన్‌ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పాకిస్థాన్‌ తాజా, మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సమానమైన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న యువతరం ఏ వయసులో కావాల్సిన ముచ్చట ఆ వయసులోనే తీర్చుకునేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతున్నది.

ఇటీవల అంతర్జాతీయ క్రికెటర్లు వరుసబెట్టి పెండ్లి కొడుకులుగా మారుతున్నారు. టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇటీవల తన ప్రయేసి బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో ఏడడుగులు నడవగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కూడా తన ప్రయేసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇక పాకిస్థాన్‌ క్రికెటర్ల విషయానికి వస్తే.. షాన్‌ మసూద్‌, షాదాబ్‌ ఖాన్‌, హరీస్‌ రవుఫ్‌ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడా లిస్ట్‌లోకి షాహీన్‌ కూడా చేరిపోయాడు. సహచరుడి పెళ్లిలో పాకిస్థాన్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌తో పాటు మాజీ సారథి సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇతర జట్టు సభ్యులు సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలను క్రికెట్‌ పాకిస్థాన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

అఫ్రిది అల్లుడు అఫ్రిది..

విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాకిస్థాన్‌ స్టార్‌ షాహిద్‌ అఫ్రిది కుమార్తె అయేషాతో శుక్రవారం షాహీన్‌ ‘నిఖా’ (ముస్లిం సంప్రదాయ పెళ్లి) జరిగింది. రెండేళ్ల క్రితమే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరుగగా.. ప్రస్తుతం అంతర్జాతీయ షెడ్యూల్‌లో విరామం లభించడంతో షాహీన్‌ పెళ్లి పీటలెక్కాడు. ఈ వేడుకకు ప్రస్తుత పాక్‌ క్రికెటర్లు బాబర్‌ ఆజమ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, హరీస్‌ రవుఫ్‌, నసీమ్‌ షాతో పాటు షాహిద్‌ అఫ్రిది సహచరులు కూడా హాజరవడంతో పెళ్లి మండపం మొత్తం క్రికెటర్లతో కిక్కిరిసింది. ఇక షాహీన్‌ అఫ్రిది సహచరులు సమాజిక మాధ్యమాల వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత టాపార్డర్‌ను కుప్పకూల్చి ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న షాహీన్‌ అఫ్రిది.. ఇప్పటి వరకు పాకిస్థాన్‌ తరఫున 25 టెస్టుల్లో 99, 32 వన్డేల్లో 62, 47 టీ20ల్లో 58 వికెట్లు పడగొట్టాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Joginder Sharma | వరల్డ్‌ కప్‌ వీరుడి వీడ్కోలు.. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జోగిందర్‌ శర్మ

Hardik Pandya | ధోనీ అడుగుజాడల్లో హార్దిక్‌.. సారథ్య బాధ్యతతో తగ్గిన పాండ్యా స్ట్రయిక్‌రేట్‌

Hanuma Vihari | మణికట్టు విరిగినా.. వెరవకుండా విహారి బ్యాటింగ్‌.. రంజీలో అద్భుతం

Sachin Tendulkar | సచిన్‌ చేతుల మీదుగా.. అండర్‌-19 జట్టుకు సన్మానం.. 5 కోట్ల చెక్‌ అందజేత

Shubman Gill | విరుచుకుపడుతున్న శుభ్‌మన్‌ గిల్‌.. విరాట్‌ కోహ్లీ రికార్డు బ్రేక్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News