Wednesday, November 29, 2023
- Advertisment -
HomeLatest NewsDonkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

Donkey farm | టైం2న్యూస్, నాగర్‌కర్నూల్: నలుగురు నడిచే దారిలో నడిస్తే ఏం లాభం.. నలుగురికి దారి చూపించేలా ఏదైనా చేయాలనుకున్నాడు ఆ యువకుడు. ఒకరికింద ఉద్యోగం చేయడం కన్నా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కాస్త వెరైటీగా ఆలోచించాడు. ఆ యువకుడి తండ్రి కూడా వ్యవసాయం, వ్యాపారాల్లో నష్టపోవడంతో కొడుకు ఆలోచనకు ఓకే చెప్పాడు. ఇంకేముంది .. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి తెలంగాణలోనే తొలి గాడిదల ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు.

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లికి మండలం వెల్గొండకు చెందిన అఖిల్ ఉన్నత చదువులు చదివాడు. ఒకరిదగ్గర ఉద్యోగం చేయడం ఇష్టం లేక సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాడు. అందరిలా కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించి గాడిదల ఫామ్‌ను ఏర్పాటు చేశాడు. తండ్రి పులిదండ నగేశ్ కూడా వ్యవసాయం, వ్యాపారంలో నష్టపోవడంతో కుమారుడు చెప్పిన ఆలోచనకు ఒకే చెప్పాడు. ఇప్పటివరకు దేశంలో గాడిద పాలకు సంబంధించిన ఫామ్‌లు రెండే ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఆదర్శంగా తీసుకుని నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడో ఫామ్ ఏర్పాటు చేశాడు అఖిల్. బిజినేపల్లిలో పొలాన్ని లీజుకు తీసుకుని తండ్రి సహకారంతో గాడిదలను పెంచుతున్నాడు.

ఐదు ఎకరాల్లో ఉన్న ఈ ఫామ్‌లో ప్రస్తుతం 64 గాడిదలు ఉన్నాయి. వీటిలో ఐదు ఫ్రెంచ్ గాడిదలు కూడా ఉన్నాయి. ఇప్పుడీ గాడిదలు ప్రతి రోజు 15 లీటర్ల పాలు ఇస్తున్నాయని అఖిల్ చెప్పాడు. ఒక్కో గాడిద రోజుకు అర లీటరు నుంచి లీటరున్నర వరకు పాలు ఇస్తోంది. లీటర్ గాడిద పాలు రూ.1500 వరకు ధర పలుకుతున్నాయి. కల్తీ లేకుండా సురక్షిత పద్ధతుల్లో గాడిద పాలను సేకరిస్తూ జాగ్రత్తగా భద్రపరుస్తున్నాడు. గాడిదలకు అవసరమైన దానా కోసం ప్రత్యేకంగా 12 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకున్నాడు. ఒక్కో ఎకరంలో ఒక్కోరకమైన గడ్డి పెంచుతున్నాడు. రాజస్థాన్ నుంచి ఈ గాడిదలను కొనుగోలు చేసినట్లు అఖిల్ తెలిపాడు. ఒక్కో గాడిదను 65 వేల నుంచి లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు.

గాడిద పాలను ఏం చేస్తారు?

గాడిద పాలను ఆయుర్వేద మందులతో పాటు కాస్మొటిక్ సబ్బుల తయారీలో వినియోగిస్తారు. ఇందుకోసం గాడిద పాలు సేకరించే ఏజెన్సీల నుంచి కంపెనీలు పాలను కొనుగోలు చేస్తాయి. పాల నాణ్యత, గాడిదల ఆరోగ్యాన్ని చూసుకునేందుకు ప్రత్యేకంగా ఒక డాక్టర్‌ను కూడా పెట్టుకున్నాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Pakistan financial crises | అమెరికాలో ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టిన పాకిస్తాన్‌.. బిడ్‌ దాఖలు చేసిన భారతీయుడు

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Cancer | భయపెడుతున్న ఊపిరితిత్తుల కేన్సర్లు .. ఆ రాష్ట్రాల్లోనే అత్యధికం

Kantara 2 | కాంతార 2 వస్తుందా.. సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన హోంబలే ఫిలింస్‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News