Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentAnupama Parameswaran | అమ్మో అనుపమ రెమ్యునరేషన్‌ ఒక్కసారిగా అంత పెంచేసిందా?

Anupama Parameswaran | అమ్మో అనుపమ రెమ్యునరేషన్‌ ఒక్కసారిగా అంత పెంచేసిందా?

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్‌కు ఇప్పుడు టైమ్‌ కలిసొస్తుంది. చాలారోజులుగా సక్సెస్‌ కోసం ఎదురుచూసిన ఈ కేరళ కుట్టి ఈ ఏడాది బ్యాక్‌ టు బ్యాక్ హిట్స్‌ అందుకుంది. దీంతో అనుపమ ఫుల్‌ హ్యాపీ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో క్రేజ్‌ పెరుగుతుండటంతో దాన్ని క్యాష్‌ చేసుకోవాలని అనుకుంటుంది. అందుకే రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా డబుల్‌ చేసిందని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది.

ప్రేమమ్‌ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన అనుపమ పరమేశ్వరన్‌కు కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్‌ ఏవీ లేవు. చాలారోజుల వరకు ప్లాపులను ఎదుర్కొంది. తన కెరీర్‌ పూర్తిగా డైలామాలో పడిపోతున్న సమయంలో కార్తికేయ 2 హిట్‌ సాధించి అనుపమ ఆశలకు ఊపిరిపోసింది. ఈ సినిమాకు తెలుగుతో పాటు నార్త్‌ నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ రావడం అనుపమకు కలిసొచ్చింది. ఆ వెంటనే వచ్చిన 18పేజిస్‌ సినిమాకు కూడా మంచి టాక్‌ వచ్చింది. చూస్తుంటే ఈ సినిమా కమర్షియల్‌గా కూడా హిట్‌ కొట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వరుసగా ఆమెకు కలిసొస్తుండటంతో దీన్ని సరిగ్గా వాడుకోవాలని అనుపమ అనుకుంటుందట. అందుకే రెమ్యునరేషన్‌ విషయంలో తగ్గేదేలె అంటుందట.

ఇప్పటివరకు 60 లక్షల వరకు తీసుకున్న అనుపమ.. తదుపరి సినిమాలకు 1.2 కోట్లు డిమాండ్‌ చేస్తుందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అంటే రెమ్యునరేషన్‌ను దాదాపు డబుల్‌ చేసిందన్నమాట. అంతేకాదు అనుపమ నటించిన బటర్‌ ఫ్లై సినిమా ఈ గురువారం రిలీజ్‌ కాబోతోంది. ఒకవేళ ఈ సినిమా కూడా హిట్‌ అయితే ఇంకో 30 లక్షల దాకా పెంచే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా పారితోషికం అంతగా పెంచేయడంతో నిర్మాతలు కూడా షాకవుతున్నారట. కానీ అనుపమకు ఇప్పుడు ఉన్న క్రేజ్‌ను చూసి అడిగినంత ఇచ్చేందుకు ప్రొడ్యూసర్స్‌ కూడా ఓకే చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ క్రేజీ గాసిప్‌లో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Prabhas | 21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్.. కారణం అదేనా?

Salman khan birth day celebrations | మాజీ ప్రియురాలికి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

Kantara 2 | కాంతార 2 వస్తుందా.. సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన హోంబలే ఫిలింస్‌

Unstoppable | బాలయ్య షోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్‌స్టార్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో !!

Waltair Veerayya | దుమ్మురేపుతున్న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్..మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News