Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentKantara 2 | కాంతార 2 వస్తుందా.. సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన హోంబలే ఫిలింస్‌

Kantara 2 | కాంతార 2 వస్తుందా.. సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన హోంబలే ఫిలింస్‌

Kantara 2 కన్నడ చిత్ర సీమ నుంచి చిన్న సినిమాగా వచ్చిన కాంతార ప్రభంజనం సృష్టించింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. సినిమా రిలీజైన కొద్దిరోజులపాటు సినీ అభిమానులంతా కాంతార మాయలో పడిపోయారు. కన్నడిగుల సంప్రదాయమైన భూతకోల కాన్సెప్ట్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను రిషబ్‌ శెట్టి తన నటనతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. అందుకే దేశవ్యాప్తంగా సినీ అభిమానులు కాంతార సినిమాకు నీరాజనం పలికారు. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించారు. దాదాపు 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 450 కోట్లకు పైగా వసూలు చేసింది.

కాంతార సినిమా రిలీజైనప్పటి నుంచి దీనికి సీక్వెల్‌ రాబోతుందనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ అభిమానులు కూడా ఈ సినిమాకు సీక్వెల్ కావాలని కోరుకున్నారు. కానీ మేకర్స్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో కాంతార సీక్వెల్‌ ఉంటుందా? లేదా అనే అయోమయంలో పడిపోయారు. ఇలాంటి సమయంలో సీక్వెల్‌పై కాంతార మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. కాంతార సినిమాకు సీక్వెన్స్‌ నిర్మించే ఆలోచన ఉందని స్పష్టం చేశారు. దీనిపై మాకు స్పష్టమైన ప్రణాళిక ఉందని తెలిపారు. కాకపోతే ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నామని.. రిషబ్‌ శెట్టి కూడా ఒక నెల విరామంలో ఉన్నారని పేర్కొన్నారు. రిషబ్‌ తిరిగొచ్చాక ప్రాంఛైజీపై అడుగులు పడతాయని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.

కేజీఎఫ్‌, కేజీఎఫ్‌ 2 వంటి పాన్‌ ఇండియా బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ను తెరకెక్కించిన హోంబలే ప్రొడక్షన్స్‌ కాంతార సినిమాను నిర్మించాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌తో సలార్‌ సినిమాను కూడా హోంబలే ప్రొడక్షన్సే నిర్మిస్తుంది. వీటితో పాటు కన్నడ, మలయాళంలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాతనే కాంతార 2 ప్రారంభం అవుతుందా? లేదా ముందే సెట్స్‌పైకి వెళ్తుందా? అనేది చూడాలి.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News