Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsInternationalDonald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు తప్పదా.. క్రిమినల్ ఛార్జ్‌లను...

Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు తప్పదా.. క్రిమినల్ ఛార్జ్‌లను ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడు ఈయనే!

Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు తప్పదా అంటే అవుననే అంటున్నారు. అమెరికా చరిత్రలో క్రిమినల్ ఛార్జ్‌లను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. తనతో లైంగిక సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన మహిళను డబ్బుతో ప్రలోభపెట్టారు ట్రంప్. ఇప్పుడీ ఆరోపణలను న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ధృవీకరించింది. దీనిపై క్రిమినల్ ఛార్జ్‌లను ఎదుర్కోనున్నారు.

ట్రంప్ లొంగిపోవడంపై మన్‌హట్టన్ జిల్లా అటార్నీ న్యాయవాదులతో చర్చించారు. ట్రంప్ లొంగిపోని పక్షలో సుప్రీంకోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం మన్‌హట్టన్ కోర్టులో ట్రంప్‌ను హాజరుకానున్నట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే.. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో పోర్న్‌స్టార్ స్ట్రోమీ డానియల్స్‌తో శారీరక సంబంధం బయట పడకుండా ఆమెకు డబ్బులు ఇచ్చి నాన్ డిజ్‌క్లోజర్ అగ్రిమెంట్ చేసుకున్నారన్న ఆరోపణలు ట్రంప్ మీద ఉన్నాయి. ఈ అగ్రిమెంట్‌ను కొట్టేయాలంటూ రెండేళ్ల తర్వాత ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని, ఆ ఆరోపణలను ఖండిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పాల్గొనకుండా చేసేందుకే డెమెక్రాటిక్ పార్టీ తప్పుడు విచారణ చేపిస్తోందని ఆరోపించారు.

ఈ కేసు విషయంలో తాను అరెస్టయ్యే అవకాశం ఉందని ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను అరెస్టు అయితే భారీ ఎత్తున నిరసనలు తెలపాలని రిపబ్లికన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే ఈ కేసులో ట్రంప్ అరెస్టవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అరెస్టయితే మాత్రం ట్రంప్ రాజకీయ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Covid Cases | దేశంలో భారీగా పెరిగిన కరోనా.. 15వేలు దాటిన యాక్టీవ్ కేసులు

IPL 2023 New Rules | ఐపీఎల్‌ కొత్త రూల్స్‌ తెలుసా!

IPL 2023 | తొలి పోరుకు హైదరాబాద్‌ సారథిగా భువనేశ్వర్‌ కుమార్‌

PL2023 | బిగ్గెస్ట్‌ క్రికెట్‌ లీగ్‌కు రంగం సిద్ధం.. ఐపీఎల్‌ తొలి పోరులో గుజరాత్‌తో చెన్నై ఢీ

Manchu Vishnu vs Manoj | మంచు విష్ణు, మనోజ్ గొడవలో బిగ్ ట్విస్ట్.. అందరినీ పిచ్చోళ్లను చేసిన మంచు బ్రదర్స్

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

Priyanka Chopra | ఆర్ఆర్ఆర్ గ్రేట్ తమిళ సినిమా.. సోషల్‌మీడియాలో ప్రియాంక చోప్రాను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Moto G13 | రూ.10వేలకే 50MP కెమెరా, డాల్బీ స్పీకర్లతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News