Moto G13 | తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? మీకో బ్రహ్మాండమైన అవకాశం. కేవలం రూ. 10వేలకే అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. మోటోరోలా కంపెనీ నుంచి మోటీ జీ సీరిస్‌లో భాగంగా జీ13 మోడల్ బుధవారం ( మార్చి 29న ) విడుదలైంది. 50 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉంది. ఇందులో డ్యుయల్ స్టీరియో డాల్బీ అట్మాస్ సౌండ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి.
ధర ఎంతంటే..
మోటో జీ13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రెండు వేరియంట్లలో లభ్యం కానున్నాయి. 4 జీబీ ర్యామ్‌తో వస్తున్న ఈ మొబైల్ 64జీబీ, 128 జీబీ వెరియంట్లలో వస్తున్నాయి. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా అఫిషియల్ వెబ్‌సైట్స్‌లో ఈ మొబైల్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 64జీబీ వేరియంట్ మొబైల్ ధరను రూ.9,499, 128జీబీ వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. మ్యాటీ చార్‌కోల్, లావెండర్ బ్లూ కలర్స్‌లో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుంది.

మోటీ జీ13 మొబైల్ పూర్తి స్పెసిఫికేషన్స్
6.5 హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్
మందం 8.19 మిల్లీమీటర్లు
బరువు 184 గ్రాములు
ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో జీ85
రేర్ కెమెరా 50mp( క్వాడ్ పిక్సెల్ కెమెరా ), 2mp, 2mp
సెల్ఫీ కెమెరా 8mp
బ్యాటరీ కెపాసిటీ 10 వాట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?
Telangana | పావు తులం ఉంగరం పోయిందని ప్రాణాలు తీసుకున్న యువతి