Friday, March 29, 2024
- Advertisment -
HomeNewsAPKiran Kumar Reddy | బీజేపీలోకి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.....

Kiran Kumar Reddy | బీజేపీలోకి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ నుంచే పోటీ !

Kiran Kumar Reddy | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత చాలాకాలం సైలెంట్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మారబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డితో బీజేపీ అగ్ర నేతలు చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఈ చర్చలు ఫలించడంతో రెండు రోజుల్లోనే ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోతున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. బీజేపీలో చేరిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలోనే క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికోసం ఆయనకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే వాదన కూడా వినిపిస్తుంది.

కాంగ్రెస్ నుంచే రాజకీయ జీవితం ప్రారంభించిన కిరణ్ కుమార్ రెడ్డి.. పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా కూడా ఆయన పనిచేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరిన సమయంలో 2010 నవంబర్‌లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతోనూ ఆయన విబేధించారు. సమైక్యాంధ్ర నినాదానికి కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీని వీడారు. సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సొంతం చేసుకోలేకపోయారు. దీంతో నాలుగేళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో కిరణ్ కుమార్ రెడ్డి అంతా యాక్టివ్‌గా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. బీజేపీ పెద్దలు ఆయనతో టచ్‌లోకి వచ్చారని కథనాలు వచ్చాయి. తాజాగా పార్టీ మారేందుకు కిరణ్ కుమార్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. రెండు రోజుల్లోనే ఆయన పార్టీ మారే అవకాశం ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News