Home Latest News Rahul Gandhi | అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి అయితే ఓకే.. పెళ్లిపై రాహుల్ గాంధీ...

Rahul Gandhi | అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి అయితే ఓకే.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

Rahul Gandhi | భారత్ జోడో యాత్ర ( Bharat Jodo Yatra )లో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ తన పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాబోయే భార్య ఎలా ఉండాలో వివరించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన రాహుల్ గాంధీ పలు విషయాలపై స్పందించారు.

ముఖ్యంగా తన నాయనమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. తన నాయనమ్మ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆమె తనకు రెండో తల్లిలాంటి వారని అభివర్ణించారు. ఈ క్రమంలో అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లికి సిద్ధమేనా అని మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకూ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న అని.. అలాంటి లక్షణాలు ఉన్న మహిళకు ప్రాధాన్యత ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. తన తల్లి సోనియా గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీ ఇద్దరి లక్షణాలు కలగలిపిన అమ్మాయి అయితే ఇంకా మంచిదని వ్యాఖ్యానించారు.

నాకు కారు కూడా లేదు

తనకు కార్లు, బైక్‌లు అంటే నచ్చవని రాహుల్ గాంధీ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనకు సొంతంగా కారు కూడా లేదని బయటపెట్టారు. ఇంట్లో సీఆర్-వి ఉన్నప్పటికీ అది అమ్మది అని తెలిపారు. కార్లంటే ఆసక్తి లేకపోయినప్పటికీ వాటికి వచ్చే టెక్నికల్ ఇష్యూస్ గురించి 90 పర్సెంట్ వరకు తెలుసన్నారు. రిపేర్స్ కూడా చేస్తానని తెలిపారు. అందరూ ఎన్‌ఫీల్డ్ ఇష్టపడతారని.. కానీ తనకు ఆ బైక్ నచ్చదని చెప్పారు. ఆర్1 కంటే ఎక్కువగా పాత లాబ్రెట్టా నచ్చుతుందని తెలిపారు. లండన్‌లో పనిచేసిన టైమ్‌లో అప్రిలియా ఆర్‌ఎస్ 250 బైక్ ఉండేదని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

విమర్శలను పట్టించుకోను

పప్పూ అంటూ ప్రతిపక్షాలు చేసే నేతలు చేసే విమర్శలపై స్పందించిన రాహుల్ గాంధీ.. తనను తిట్టినా.. కొట్టినా ఎవరినీ ద్వేషించనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అదొక చెడు ప్రచారమని తెలిపారు. వాళ్ల జీవితంలో బంధుత్వాలు సరిగ్గా లేక కొంతమంది బాధపడుతుంటారు.. వారే ఎదుటివారిని ద్వేషిస్తుంటారని వ్యాఖ్యానించారు. తనను ఎంత తిట్టినా వాటిని స్వాగతిస్తానని స్పష్టం చేశారు. తనకెన్ని పేర్లు పెట్టినా లెక్క చేయనని పేర్కొన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

Corona cases | రాబోయే 40 రోజులు కీలకం.. భారత్‌లో భారీగా కరోనా కేసులు పెరిగే ఛాన్స్!

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Exit mobile version