Home News AP Pawan kalyan | వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం.. కమెడియన్ అలీ సెన్సేషనల్...

Pawan kalyan | వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం.. కమెడియన్ అలీ సెన్సేషనల్ కామెంట్స్

Pawan kalyan | వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధమని కమెడియన్ అలీ ప్రకటించారు. పవన్ తనకు మిత్రుడే అయినప్పటికీ సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు ఏం చేశారనేది అందరికీ తెలుసని చెప్పారు. సీఎం జగన్ ఆదేశిప్తే ఎవరిపైనా అయినా సరే పోటీ చేస్తానని పేర్కొన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు సాధారణమని అన్నారు. 2024లో వైసీపీ 175 స్థానాలకు 175 స్థానాల్లో విజంయ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కమెడియన్ అలీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ‌కు మధ్య మంచి స్నేహం ఉంది. కానీ ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తినట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల ముందు అలీ.. వైసీపీలో చేరాడు. జగన్ తరఫున ప్రచారం చేశాడు. అప్పుడే పార్టీలో ఆయనకు మంచి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు.. కానీ ఎలాంటి పదవి రాలేదు. కానీ గత ఏడాది అక్టోబర్ 27న ఏపీ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా అలీని నియమిస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అలీ వైసీపీలో చేరినప్పటి నుంచే పవన్ కళ్యాణ్‌తో విబేధాలు మొదలైనట్టు వార్తలు వినిపించాయి. ఇటీవల అలీ కూతురి పెళ్లికి కూడా పవన్ కళ్యాణ్ రాలేదు. దీంతో ఈ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. కానీ అప్పుడు ఈ విషయాన్ని అలీ సమర్థించుకున్నాడు. పవన్‌ కళ్యాణ్ వద్దామని అనుకున్నాడు.. కానీ వీలు కాలేదని.. అందుకే ఫోన్ చేసి విషెస్ చెప్పాడని అన్నారు. అభిమానులు కూడా నిజమేనేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమేనని అలీ ప్రకటించడంతో వీరిద్దరి మధ్య విబేధాలు ఇంకా తగ్గలేదనే నిర్ధారణకు వస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

nepal plane crash | నేపాల్‌లో విమానం కూలింది ఇలా.. ప్రమాదం జరిగే ముందు ఫేస్‌బుక్‌ లైవ్ పెట్టిన యూపీ యువకులు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

Exit mobile version