Home Latest News Central government on OPS | పాత పెన్షన్‌ పథకంపై కేంద్రం కీలక కామెంట్స్‌.. ఇక...

Central government on OPS | పాత పెన్షన్‌ పథకంపై కేంద్రం కీలక కామెంట్స్‌.. ఇక అంతే సంగతులా ?

Central government on OPS | అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే తమ తొలి కేబినెట్‌ భేటీలోనే పాత పెన్షన్‌ విధానాన్ని ( old pension scheme ) పునరుద్దరిస్తామని హిమాచల్‌ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు మరోసారి స్పష్టం చేశారు. అటు పంజాబ్‌ ప్రభుత్వం కూడా పాత పెన్షన్‌ పథకాన్ని అమలు చేస్తామని నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరించే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ ఖరాద్‌ పార్లమెంట్‌ వేదికగా తేల్చిచెప్పారు.

తమ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీమ్‌ ( OPS ) పునరుద్ధరిస్తామని రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి, పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి ఇప్పటికే తెలిపాయి. గత నెలలో పంజాబ్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం కూడా ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భగవత్‌ కరాద్‌ లోక్‌సభలో చేసిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పంజాబ్‌ ప్రభుత్వ జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. పాత పెన్షన్‌ విధానం అమలు చేయడానికి పెన్షన్ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌ 2013లో ఎటువంటి నిబంధనలు లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి

Money Plant | మనీ ప్లాంట్‌ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది

Exit mobile version