Home News AP Breaking News | శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్ కలకలం.. మత్స్యకారులకు చిక్కిన10 అడుగుల విమానం

Breaking News | శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్ కలకలం.. మత్స్యకారులకు చిక్కిన10 అడుగుల విమానం

Image by starline on Freepik

Breaking News | శ్రీకాకుళం జిల్లాలో విమానాన్ని పోలిన డ్రోన్ కలకలం సృష్టించింది. భావనపాడు, మూలపేట సముద్ర తీరంలో పడిపోయిన ఈ డ్రోన్ విమానాన్ని మత్స్యకారులు గుర్తించారు. దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న డ్రోన్ విమానంపై టార్గెట్ బన్షీ అనే పేరుతో పాటు 8081 అనే నంబర్లు ఉన్నాయి. దీంతో కంగారుపడిపోయిన మత్స్యకారులు.. మెరీన్ పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి వచ్చిన మెరీన్ పోలీసులు డ్రోన్ విమానాన్ని పరిశీలించారు. దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న డ్రోన్ విమానం 100 కిలోల పైగానే బరువు ఉంటుందని వారు అంచనా వేశారు. పర్యావరణ పరిస్థితులను పరీక్షించేందుకు వాతావరణ శాఖ లేదా వ్యవసాయశాఖ ప్రయోగించినదా.. లేదా రక్షణ శాఖ ప్రయోగాలు చేసేందుకు వాడినదా అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఇది నిఘా వర్గాలకు సంబంధించినదా.. లేదా ఆకతాయిల పని అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటు నేవీ కోస్ట్‌గార్డ్, ఎయిర్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్స్‌కు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

SSMB28 | అమ్మో.. మహేశ్, త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?

Venu Madhav | వేణుమాధవ్ మరణానికి అసలు కారణం అదే.. సంచలన విషయం బయటపెట్టిన కమెడియన్‌ తల్లి సావిత్రమ్మ

Varun Tej | త్వరలోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. పెళ్లికూతురు ఆమేనా?

Exit mobile version