Home News AP Palnadu | పల్నాడు జిల్లా రొంపిచర్లలో టీడీపీ నేతపై కాల్పులు.. టీడీపీ, వైసీపీ మధ్య రచ్చ

Palnadu | పల్నాడు జిల్లా రొంపిచర్లలో టీడీపీ నేతపై కాల్పులు.. టీడీపీ, వైసీపీ మధ్య రచ్చ

Palnadu | పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. రొంపిచర్ల టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి ఇంటికి వెళ్లిన ముగ్గురు కాల్పులకు పాల్పడ్డారు. బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపిన పమ్మి వెంకటేశ్వరరెడ్డి, రొంపిచర్ల వైసీపీ ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, పూజల రాముడును అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీళ్లకు గన్ సప్లై చేసిన అంజిరెడ్డిని కూడా అరెస్టు చేశారు.

వైసీపీ కనుసన్నల్లోనే కాల్పులు : టీడీపీ

బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపిన ముగ్గురు కూడా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులేనని టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. గతంలో వెంకటేశ్వరరెడ్డికి గోపిరెడ్డి ఆశ్రయం కూడా కల్పించారని పేర్కొన్నారు. గోపిరెడ్డి నరసరావుపేటకు గన్ కల్చర్ తీసుకొచ్చారని విమర్శించారు. ఆయన కనుసన్నల్లోనే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలకోటిరెడ్డికి ఏదైనా జరిగితే దానికి వైసీపీనే బాధ్యత వహించాలని అన్నారు.

టీడీపీలో ఆధిపత్య పోరే కారణం : ఎమ్మెల్యే గోపిరెడ్డి

బాలకోటిరెడ్డిపై కాల్పుల ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించారు. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణం అని ఆయన ఆరోపించారు. బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపిన వెంకటేశ్వరరెడ్డి ఇంకా టీడీపీలోనే ఉన్నాడని తెలిపారు. దీన్ని నిరూపించడానికి సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు. అందరి కాల్ డేటా బయటకు తీయాలని.. అప్పుడు ఎవరు ఎవరితో మాట్లాడారో స్పష్టమవుతుందని అన్నారు. బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపిన వాళ్లతో పాటు గన్ సప్లై చేయిన అంజిరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారని గోపిరెడ్డి తెలిపారు. బాధ్యలను అరెస్టు చేయాలని పోలీసులకు తానే చెప్పానని పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Breaking News | శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్ కలకలం.. మత్స్యకారులకు చిక్కిన10 అడుగుల విమానం

Vizag | రాజు ఎక్కడుంటే.. రాజధాని అక్కడే.. మూడు రాజధానులపై ఏపీ మంత్రి అమర్‌నాథ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Nirmala Sitharaman | బడ్జెట్‌ ప్రసంగంలో టంగ్‌ స్లిప్‌ అయిన నిర్మలమ్మ.. సభలో విరబూసిన నవ్వులు

Tarakaratna | 45 నిమిషాలు గుండె ఆగడంతో తారకరత్న మెదడు వాచింది.. ఆరోగ్య పరిస్థితి వివరించిన విజయసాయిరెడ్డి

Andhra Pradesh Capital | ఏపీ సీఎం జగన్‌ కీలక ప్రకటన.. ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచిన విశాఖపట్నం

Exit mobile version