Home Entertainment Varun Tej | త్వరలోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. పెళ్లికూతురు ఆమేనా?

Varun Tej | త్వరలోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. పెళ్లికూతురు ఆమేనా?

Varun Tej | మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ పెళ్లిపై కొంతకాలంగా రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. లావణ్య త్రిపాఠితో వరుణ్‌ ప్రేమలో ఉన్నాడని.. తొందరలోనే ఆమెను వివాహం చేసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. మెగా హీరో పెళ్లిపై సోషల్‌ మీడియాలో ఎంత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇన్ని రోజుల వరకు ఎవరూ స్పందించలేదు. దీంతో అదంతా వట్టి పుకారేనేమో అని మెగా ఫ్యాన్స్‌ ఫిక్సయిపోయారు. ఇలాంటి టైమ్‌లో వరుణ్‌ తేజ్‌ పెళ్లిపై మెగా బ్రదర్‌ నాగబాబు స్పందించాడు. ఈ ఏడాదిలోనే వరుణ్‌ పెళ్లి ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

త్వరలోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి ఉంటుందని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో కన్ఫార్మ్‌ చేశాడు. పెళ్లి విషయాన్ని వరుణ్‌ తేజ్‌ ప్రకటిస్తాడని తెలిపాడు. అమ్మాయి ఎవరనేది కూడా అతనే చెబుతాడని చెప్పాడు. అంతేకాదు పెళ్లి తర్వాత వరుణ్‌ వేరే ఇంట్లో ఉంటాడని పేర్కొన్నాడు. తన బిడ్డలకు ప్రైవసీ ఇవ్వడం తనకు అలవాటు అని.. అందుకే వరుణ్‌ పెళ్లి తర్వాత వేర్వేరు ఇళ్లలో ఉంటామని నాగబాబు చెప్పాడు. వేర్వేరు ఇళ్లలో ఉన్నప్పటికీ తమ మధ్య అనుబంధం అలాగే ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే హీరోయిన్‌ లావణ్య త్రిపాఠితో వస్తున్న పెళ్లి రూమర్స్‌పై ప్రశ్నించగా.. ఇంతకు మించి ఇప్పుడే తానేమీ చెప్పలేనని నాగబాబు బదులిచ్చాడు. తాను చేసుకోబోయే అమ్మాయి ఎవరనేది వరుణ్‌ తేజ్‌నే ప్రకటిస్తాడని స్పష్టం చేశాడు. దీంతో నెట్టింట ప్రచారమవుతున్నట్టుగా వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం నిజమేనేమో అని నెటిజన్లు ఫీలవుతున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్‌ చేసి చూడాల్సిందే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nayanthara | నన్ను కూడా కమిట్‌మెంట్ అడిగారు.. సంచలన విషయం బయటపెట్టిన నయనతార

Jabardasth | జబర్దస్త్ నుంచి సింగర్ మనో ఎందుకు తప్పుకున్నాడు? కారణమేంటి?

Keerthy Suresh | మహానటి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. అసలు నిజమేనని చెప్పేసిన కీర్తి సురేశ్ తల్లి

Ileana | ఆస్పత్రి బెడ్‌పై ఇలియానా.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నానంటూ పోస్టు

Exit mobile version