Home Latest News Nirbhaya Fund | ఎమ్మెల్యేల రక్షణకు నిర్భయ వాహనాలు.. షిండే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Nirbhaya Fund | ఎమ్మెల్యేల రక్షణకు నిర్భయ వాహనాలు.. షిండే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Nirbhaya Fund | నిర్భయ నిధులతో కొనుగోలు చేసిన పోలీసు వాహనాలను మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల రక్షణ కోసం ఉపయోగిస్తుండటంపై మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు వినియోగించే బొలేరో వాహనాలను ఎమ్మెల్యేలు ఇవ్వడంతో రక్షణ కల్పించే పోలీసులకు వాహనాల కొరత ఏర్పడింది. దీంతో పోలీసులు కండీషన్ లో లేని వాహనాలను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి విధులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి సంబంధించి వరుస కథనాలు రావడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే దిగి వచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేల రక్షణ కోసం వినియోగించిన పోలీసు వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ముంబై నగర శివారులోని పోలీస్ స్టేషన్ల నుంచి ఈ వాహనాలను తీసుకొచ్చారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో బొలేరో వాహనాలను ఆయా పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ ఏడాది జూన్ లో నిర్భయ నిధులతో 220 బొలెరో వాహనాలను మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే వీటిలో 47 వాహనాలను షిండే సర్కార్.. ఎమ్మెల్యేల రక్షణకు పంపించింది.

వీటిలో కొన్ని వాహనాలను తిరిగి పోలీసులకు ఇచ్చినా.. మరికొన్నింటిని ఎమ్మెల్యేల రక్షణ కోసమే వినియోగిస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్గంలోని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఇటీవల నిర్భయ వాహనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వాహనాలను పోలీసులకు ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని హెచ్చించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

MLC kavitha | సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. కేంద్రంపై కీలక వ్యాఖ్యలు

konda surekha resigns | కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన కొండా సురేఖ.. రేవంత్ రెడ్డికి రాజీనామా లేఖ.. అసలేమైంది?

Ramcharan – Upasana | మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్

Pawan kalyan new movie | పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా టైటిల్ ఫిక్సయిందా.. అదే టైటిల్ అయితే ఫ్యాన్స్ కి పూనకమే!

Anupama Parameswaran | అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎందుకు కాలేకపోయింది?

Exit mobile version