Ramcharan – Upasana | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రామ్‌చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ‘ ఉపాసన, రామ్‌చరణ్ దంపతులు తొందరలోనే తమ మొదటి బిడ్డను ఈ లోకంలోకి ఆహ్వానించబోతున్నారు. హనుమాన్ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రేమతో మీ సురేఖ – చిరంజీవి, శోభన – అనిల్ కామినేని’ అని పేర్కొన్నారు.
రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు 2012 జూన్ 14న వివాహమైంది. పెళ్లి జరిగినప్పటి నుంచి చరణ్ దంపతులు శుభవార్త ఎప్పుడు చెబుతారా అని మెగా అభిమానులు ఎదురుచూశారు. ఈ పదేళ్ల కాలంలో రామ్‌చరణ్, ఉపాసన జంట ఎక్కడికి వెళ్లినా పిల్లలు ఎప్పుడు అనే ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. ఉపాసన ప్రెగ్నెంట్ అని పుకార్లు కూడా వచ్చాయి. కానీ దానికి చరణ్ దంపతుల నుంచి మౌనమే సమాధానమైంది. దీంతో రామ్ చరణ్ జంట గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో చిరంజీవి చెప్పిన వార్త విని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read More Articles |
Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా పవర్ స్టార్
Ananya Panday | లైగర్ ఎఫెక్ట్.. ఆఫర్లు లేక భారీగా రెమ్యునరేషన్ తగ్గించిన అనన్య పాండే
Megastar chiranjeevi | చిరంజీవి, రామ్ చరణ్ అవార్డుల వెనుక రాజకీయం ఉందా ? అభిమానులు ఏమంటున్నారు ?