Home Lifestyle Do you know Health Tips | నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. కారణాలు ఇవే కావచ్చు! ఒకసారి చెక్...

Health Tips | నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. కారణాలు ఇవే కావచ్చు! ఒకసారి చెక్ చేసుకోండి..

Health Tips | మీ నోటి నుంచి తరచుగా దుర్వాసన వస్తుందా ? బ్రష్‌ చేసుకుంటే సరిపోతుందనో.. ఇలాచీ, సోంప్‌ వేసుకుంటే సరపోతుందని అనుకుంటున్నారా? అలా అస్సలు అనుకోకండి. నోటి దుర్వాసన అనేది అనారోగ్య సమస్యకు సూచన. కాబట్టి ఈ సమస్యను లైట్ తీసుకోకుండా.. జాగ్రత్త పడాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. నోటి దుర్వాసనకు ( bad breath ) కూడా కారణాలు ఇవే కావొచ్చు.. ఓసారి చెక్‌ చేసుకోండి.

సాధారణంగా అన్నం తిని పడుకున్నాక మన నోటిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీంతో ఉదయం లేవగానే దుర్వాసన వస్తుంటుంది. ఒక్కోసారి నోరు ఎండిపోయి కూడా దుర్వాసన వస్తుంటుంది. అంతేకాదు పళ్లు తోమకపోతే.. తిన్న తర్వాత పళ్లల్లో ఇరుక్కుపోయిన ఆహారపదార్థాలు నోటిలోనే ఉండిపోతాయి. తద్వారా బ్యాక్టీరియా వృద్ధి చెంది దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటి విషయంలో కట్టుడుపళ్లు పెట్టించుకున్నవాళ్లు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. పళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

చిగుళ్ల వ్యాధి కావొచ్చు

దుర్వాసనతో పాటు రుచి తెల్వకపోడం జరిగితే కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. తరచుగా ఇలాంటి సమస్య వస్తే చిగుళ్ల వ్యాధిగా అనుమానించాలి. ఎందుకంటే దాన్ని అలాగే వదిలేస్తే పళ్లను పట్టి ఉంచే ఎముక దెబ్బతింటుంది.

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌

ప్రతిరోజు పళ్లు బ్రష్‌తో మంచిగా శుభ్రం చేసుకున్నా కూడా దుర్వాసన వస్తుందంటే అనుమానించాల్సిందే. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు నోటి నుంచి దుర్వాసన వచ్చే ఛాన్స్‌ ఉంది.

జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్లు

ఒక్కోసారి కడుపులో ఇన్ఫెక్షన్‌ వచ్చినా, పేగుళ్లో ఇన్ఫెక్షన్లు వచ్చినా కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. దుర్వాసనతో పాటు కడుపు నొప్పిగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

లాలా జల గ్రంధుల్లో సమస్యలు

నోరు పొడిబారిపోవడాన్ని జిరోస్టోమియా అంటారు. ఇది కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. నోటిలో లాలాజల ఉత్పత్తి తగ్గినప్పుడు బ్యాక్టీరియా పెరుగుతుంది. లాలా జల గ్రంథుల సమస్యలు ఉన్నవాళ్లకు కూడా నోరు తరచుగా ఎండిపోతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Beauty tips for lips | చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Exit mobile version