Home News AP Weather Updates | బిపర్‌జాయ్ ఎఫెక్ట్.. తెలంగాణలో వర్షాలు బంద్.. జూన్ చివరిదాకా ఎండలే !

Weather Updates | బిపర్‌జాయ్ ఎఫెక్ట్.. తెలంగాణలో వర్షాలు బంద్.. జూన్ చివరిదాకా ఎండలే !

Weather Updates | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్ తుఫాను ( Biparjoy Cyclone ) గుజరాత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. కచ్, సౌరాష్ట్ర జిల్లాలు సహా తీర ప్రాంతాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి కచ్‌లోని లఖ్‌పత్ సమీపంలో ఈ తుఫాను దీరం దాటినప్పటికీ.. దీని ప్రభావం ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే బిపర్‌జాయ్ ఎఫెక్ట్‌తో నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలుగు రాష్ట్రాల్లో కురవాల్సిన వర్షాలు ఆగిపోయాయి. బిపర్‌జాయ్ కారణంగా కొంత ఆలస్యంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడటం వల్ల తేమ మొత్తం అటువైపే వెళ్లి పోవడంతో నైరుతి రుతుపవనాల కదలికలు నెమ్మదించాయని, తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఏర్పడి ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల జూన్ నెలలో వర్షాలు కురిసే అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయని పేర్కొంది. గుజరాత్‌లోని లఖ్‌పత్‌లో తీరం దాటిన తుఫాను ప్రభావం పూర్తిగా తొలగిపోతే తప్ప నైరుతి రుతుపవనాల కదలికలు పుంజుకోవని.. అప్పటిదాకా భానుడి భగభగలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kajal Aggarwal | మళ్లీ తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్

Adipurush | ఆలయాలుగా మారిన ఆదిపురుష్ థియేటర్లు.. హనుమంతుడి సీటు ఎలా ఉందో చూశారా?

Pan Card Number | మీ పాన్ నంబర్ మాటిమాటికి మరిచిపోతున్నారా? ఈ చిన్న లాజిక్‌తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు

Exit mobile version