Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsAPSriharikota | శ్రీహరి కోటలో వరుస ఆత్మహత్యలు.. నిన్న ఎస్సై, కానిస్టేబుల్.. ఇవాళ ఎస్సై భార్య...

Sriharikota | శ్రీహరి కోటలో వరుస ఆత్మహత్యలు.. నిన్న ఎస్సై, కానిస్టేబుల్.. ఇవాళ ఎస్సై భార్య బలవన్మరణం

Sriharikota | తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న ఎస్సై వికాస్ సింగ్ భార్య నర్మదా గెస్ట్ హౌజ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.

సీఐఎస్ఎఫ్ వికాస్ సింగ్ మంగళవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మరణ వార్త విని షాక్‌కు గురైన ఆమె.. నిన్న అన్నతో కలిసి శ్రీహరి కోట వచ్చారు. భర్త మృతిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వికాస్ సింగ్‌కు అప్పులు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

2015 బ్యాచ్‌కు చెందిన వికాస్ సింగ్ స్వస్థలం బిహార్‌. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు ఒకటో తరగతి, పాప ఎల్‌కేజీ, మరో కుమార్తె చిన్నపాప ఉన్నారు. వీరిలో ఒకరు దివ్యాంగురాలు. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి ముగ్గురు అనాథలుగా మారారు. ముంబైలో శిక్షణ అనంతరం వికాస్ సింగ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో విధులు నిర్వహించేవారు.. గత ఏడాది శ్రీహరికోటకు బదిలీపై వచ్చారు. అయితే ముంబైలో విధులు నిర్వహిస్తున్న సమయంలో క్రమశిక్షణ చర్యలకు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ జరుగుతుండగానే వికాస్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

America Mega Million Jackpot | అన్‌ లక్కీడే రోజే జాక్‌పాట్‌.. లాటరీలో రూ.10వేల కోట్లు గెలుచుకున్నాడు..

New Corona Variant | అత్యంత ప్రమాదకారిగా కరోనా సూపర్ సబ్ వేరియంట్.. అమెరికాలో వైరస్ వ్యాప్తికి కారణమిదే.. భారత్‌లోనూ 26 కేసులు

Nepal plane crash | న్యూ ఇయర్ రోజే ఎయిర్ పోర్టు ప్రారంభం.. 15 రోజులు కాకముందే కుప్పకూలిన విమానం

Nepal plane crash | భర్త కోసం పైలట్ అవ్వాలని కష్టపడింది.. 16 ఏళ్ల తర్వాత అతనిలాగే ప్రాణాలు కోల్పోయింది.

nepal plane crash | నేపాల్‌లో విమానం కూలింది ఇలా.. ప్రమాదం జరిగే ముందు ఫేస్‌బుక్‌ లైవ్ పెట్టిన యూపీ యువకులు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News