Home News AP Byreddy Siddarth Reddy | వైఎస్‌ జగన్‌ తెలంగాణలో వేలు పెడితే ప్రభుత్వాలు తలకిందులవుతాయి.. బీఆర్‌ఎస్‌పై...

Byreddy Siddarth Reddy | వైఎస్‌ జగన్‌ తెలంగాణలో వేలు పెడితే ప్రభుత్వాలు తలకిందులవుతాయి.. బీఆర్‌ఎస్‌పై బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Byreddy Siddarth Reddy | బీఆర్ఎస్‌ పార్టీ పై వెస్సార్సీపీ యువనేత, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయ పార్టీని స్థాపించారు. ఢిల్లీలో పార్టీ జెండాను ఎగురవేసిన కేసీఆర్ ఖమ్మంలో మొదటి సారిగా భారీ సభను ఏర్పాటు చేశారు. దీంతో దేశం మొత్తం బీఆర్‌ఎస్‌ గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి బీఆర్ఎస్‌ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్‌ ఏపీలో అడుగుపెడితే ఏం చేస్తుందో చూస్తామని.. తెలంగాణలో జగన్‌ ప్రవేశిస్తే అక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు వస్తాయని వ్యాఖ్యానించారు. జగన్‌ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన కోసం స్పందించే కొన్ని కోట్ల హృదయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ దృష్టితోనే నేను జగన్‌కు ప్రైవేటు సైన్యం ఉందని అన్నట్లు చెప్పారు. ” పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ జగన్‌కి అభిమానులు ఉన్నారు. బీఆర్‌ఎస్‌ ఏదో పెద్ద పొడిచేస్తుంది, చించేస్తోంది… అంటూ తెలంగాణ మంత్రులు తెగ ఊదరగొడుతున్నారు. వాళ్లు ఏపీకి వచ్చి ఏం పొడుస్తారో తెలియదు. కానీ జగన్‌ సార్‌ ఒక్కసారి తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం అక్కడి ప్రభుత్వాలే తలకిందలవుతాయి” అంటూ బైరెడ్డి కామెంట్లు చేశారు.

పవన్‌ కల్యాణ్‌ మీద కూడా బైరెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల పేర్లు కూడా పవన్‌ తెలియవని విమర్శించారు. హైపర్‌ ఆది లాంటి వాళ్లు తాము ఎలాంటి నాయకుల కింద పని చేస్తున్నామో గుర్తించాలని అన్నారు. మా పార్టీలో ఉన్నప్పుడు పవన్‌ని బూతులు తిట్టి, ఇప్పుడు జనసేనకి జంప్‌ అయ్యి మమ్మల్ని బూతులు తిట్టేవాళ్లను కూడా చూశాం అంటూ పేర్కొన్నారు. హైపర్‌ ఆదిని, ఆ పార్టీకి చెందిన ఇతర వ్యక్తులను నేను తప్పుపట్టనని, ఆ పార్టీ నాయకత్వాన్ని మాత్రమే తప్పుపడతానని బైరెడ్డి సిద్దార్థ్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

Sriharikota | శ్రీహరి కోటలో వరుస ఆత్మహత్యలు.. నిన్న ఎస్సై, కానిస్టేబుల్.. ఇవాళ ఎస్సై భార్య బలవన్మరణం

Andhra Pradesh | సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. దీని చుట్టే ఇప్పుడు రాజకీయాలు!

Pawan kalyan | వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం.. కమెడియన్ అలీ సెన్సేషనల్ కామెంట్స్

RK Roja | పవన్ ఎపిసోడ్ వచ్చాక బాలయ్య టాక్ షోకి వెళ్లొద్దనే నిర్ణయించుకున్నా.. రోజా అన్‌స్టాపబుల్ పంచ్‌లు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

Exit mobile version