Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsAPMid day meal | విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి జావ.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Mid day meal | విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి జావ.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Mid day meal | జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం మెనూలో స్వల్ప మార్పులు చేశారు. పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపాలు తలెత్తకుండా ఉండేందుకు బెల్లం, రాగిజావను బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. పాఠశాల విద్యాశాఖపై గురువారం సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఒక గ్లాస్ చొప్పున రాగి జావ అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచే దీన్ని అందించాలని సూచించారు.

గోరుముద్ద పథకంలో భాగంగా పిల్లలకు అందించే ఆహార నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఫోర్టిఫైడ్ స్టీమ్డ్ సార్టెక్స్ రైస్‌ను మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి స్కూల్ తరగతి గదుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని.. డిజిల్ స్క్రీన్లతో విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించాలని ఆదేశించారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్‌లు వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

మధ్యాహ్న భోజనంలో చికెన్

మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు చికెన్, పండ్లు అందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం పోషణ్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో బియ్యం, పప్పులు, కూరగాయాలు, సోయాబీన్, గుడ్లు అందిస్తున్నారు. వీటికి అదనంగా వారానికి ఒక్క రోజు చికెన్, సీజనల్ పండ్లను విద్యార్థులకు అందించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం అదనంగా రూ.371 కోట్లను కేటాయించింది. జనవరి నుంచే అదనపు పౌష్టికాహార పథకం అమల్లోకి వస్తుందని.. 16 వారాల పాటు ఇది కొనసాగనుందని సమాచారం. ఏప్రిల్ తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో దీన్ని కొనసాగిస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Varisu Art Director Sunil Babu | వారిసు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు మృతి.. సినిమా రిలీజ్‌కు వారం ముందు విషాదం

Prince Harry | బ్రిటన్‌ రాజకుటుంబంలో మళ్లీ గొడవలు తప్పవా? ఆత్మకథతో ప్రిన్స్‌ హ్యారీ అందర్నీ రచ్చకీడుస్తాడా?

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Samosa | సమోసాలో ఎలుక.. తినేప్పుడు బయటపడటంతో దడుసుకున్న కస్టమర్‌.. సిద్దిపేట జిల్లాలోనే!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News