Thursday, September 21, 2023
- Advertisment -
HomeNewsAPPawan Kalyan | నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్‌.. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ కౌంటర్‌

Pawan Kalyan | నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్‌.. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ కౌంటర్‌

Pawan Kalyan | ఏపీ మాజీ మంత్రి పేర్ని నానికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కౌంటర్‌ వేశారు. నువ్వు ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా అంటూ పేర్ని నాని వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. తన రెండు చెప్పులు ఎవరో కొట్టేశారని.. వాటిని వెంటనే ఇప్పించండి అంటూ సెటైర్‌ వేశారు. గుడి ముందు వదిలిన తన చెప్పులను కూడా కొట్టేసే స్థాయికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందంటూ విమర్శించారు.

పిఠాపురంలో శుక్రవారం వారాహి యాత్ర చేపట్టిన పవన్‌ కళ్యాణ్‌.. ఉప్పాడ బస్టాండ్‌ దగ్గర బహిరంగ సభలో ప్రసంగించారు. తెల్లబట్టల్లో కాకుండా ఇలా ఎందుకు వచ్చానని సందేహం వచ్చిందా? అని సభకు వచ్చిన అభిమానులను పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు. మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్తే తన రెండు చెప్పులు కొట్టేశారని అన్నారు. చెప్పులు లేకపోతే కుర్తా, జుబ్బా వేసుకుంటే బాగోదు కదా.. అందుకే ప్యాంట్‌, షర్ట్‌ వేసుకుని షూ వేసుకుని రావాల్సి వచ్చిందని చెప్పారు. తనకిష్టమైన తన రెండు చెప్పులు ఎవరో కొట్టేశారని.. ఆ వ్యక్తి ఎవరో కనిపిస్తే చెప్పండి అంటూ పేర్ని నానిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తన చెప్పులు తనకు ఇప్పించండి ప్లీజ్‌ అంటూ సెటైర్లు వేశారు. గుడి ముందు వదిలిన చెప్పులు కూడా వైసీపీ పట్టుకెళ్తోందని.. తనకు బాధేస్తుందని ఎద్దేవా చేశారు.

ఇటీవల వారాహి యాత్రపై, జనసేనానిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ఒక చెప్పు చూపిస్తే తను రెండు చెప్పులు చూపిస్తానని.. మక్కెలిరిగిపోతాయని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజలను నమ్ముకుంటే మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెడతారని.. చంద్రబాబును నమ్ముకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరని హితవు పలికారు. ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని రెండు చెప్పులు చూపించడంపైనే పవన్‌ కళ్యాణ్‌ ఇలా సెటైర్లు వేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Adipurush | ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చిన హనుమంతుడు.. జై శ్రీరామ్ అంటూ మార్మోగిన సినిమా హాల్

Adipurush | ఆలయాలుగా మారిన ఆదిపురుష్ థియేటర్లు.. హనుమంతుడి సీటు ఎలా ఉందో చూశారా?

Weather Updates | బిపర్‌జాయ్ ఎఫెక్ట్.. తెలంగాణలో వర్షాలు బంద్.. జూన్ చివరిదాకా ఎండలే !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News