Tuesday, April 16, 2024
- Advertisment -
HomeNewsAPAP Assembly | బీసీలు, ఎస్సీలకు గొడవ పెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడు.. ఏపీ స్పీకర్‌ సంచలన...

AP Assembly | బీసీలు, ఎస్సీలకు గొడవ పెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడు.. ఏపీ స్పీకర్‌ సంచలన ఆరోపణలు!

AP Assembly | ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం గురించి స్పీకర్‌ సీతారాం స్పందించారు. సభలో టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యాన్ని దాడిని ఆయన ఖండించారు. టీడీపీ సీనియర్‌ సభ్యులే తనపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. నా పై దురుసుగా ప్రవర్తించడం సీనియారిటీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు వర్గాల వారంటే అంత చిన్న చూపా అంటూ మండిపడ్డారు.

సభలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. సభలో ఉన్న వారందరూ కూడా తనకు సమానమేనని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్‌ కుర్చీని టచ్‌ చేసి ముఖం పై ప్లకార్డులు ఉంచారని ఆయన మండిపడ్డారు. అయినప్పటికీ కూడా తాను మౌనంగానే ఉన్నానని అన్నారు. అసలు సభలో దాడులు చేయాలని టీడీపీ వారికి ఎవరు చెప్పారు? సభను సజావుగా నడిపించండమే నా కర్తవ్యం. ఎమ్మెల్యే ఎలీజాను టీడీపీ వారు నెట్టేశారు. సమయాన్ని, ధనాన్ని కూడా టీడీపీ వారు వృథా చేస్తున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రోజమ్మను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు. సభలో ప్రతిపక్ష నేతలకు స్పీకర్‌ అంటే మర్యాద లేదని ఆయన అన్నారు.

ముఖం మీద కాగితాలు పెడతారని, వేలు చూపిస్తూ మాట్లాడతారని ఆయన అన్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు ఆ పార్టీ పెద్ద ఎటువంటి వారైతే నాయకులు కూడా అటువంటి వారే అవుతారని స్పీకర్‌ అన్నారు. స్పీకర్‌ అన్నా.. సభ అన్నా గౌరవం లేని వారు శాసన సభకు పనికి వచ్చే వారా? పనికి రాని వారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు బీసీలకు ఎస్సీలకు గొడవ పెట్టాలని చూస్తున్నారని, అందులో భాగంగానే ఎస్సీ ఎమ్మెల్యేలను కావాలని రెచ్చగొట్టి పంపుతున్నారని మండిపడ్డారు. ఈరోజు తాము సహనంతో ఉన్నామంటే అది చేతకానితనం కాదని ఆయన అన్నారు.

ప్రతిపక్ష నేతలు ప్రతులు చింపి తల మీద వేస్తుంటే వాటిని పూలు చల్లుతున్నట్లు భావించానే కానీ వాటిని నేను నెగిటివ్‌ గా తీసుకోలేదని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడు స్పీకర్‌ కి అడ్డంగా నిలబడి వేలు చూపించి మాట్లాడతారు. ఆయన ఎత్తుకి సభ కనిపించడం లేదని పక్కకు జరిపితే.. స్పీకర్‌ మ్యాన్‌ హ్యాండిలింగ్‌ చేశారని ఆరోపిస్తారని పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజైనా సోమవారం మొదలైయ్యాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జీవో నెం 1. గురించి మాట్లాడుతూ సభను వాయిదా వేయాలని పట్టుబట్టారు. అంతటితో ఆగకుండా స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని జీవో నెం 1 ప్రతులను చింపి స్పీకర్‌ మీదకు విసిరారు. దీంతో అధికార పక్ష ఎమ్మెల్యేలు కూడా పోడియం వద్దకు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా అధికార పక్ష ఎమ్మెల్యేలు, ప్రతి పక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆ తర్వాత కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి .. సంతనూతలపాడు టీజేఆర్ సుధాకర్ బాబు ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. బీసీ అయిన సభాపతిని కాపాడుకోవడానికి వెళ్లామని.. టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇది బ్లాక్ డే.. స్పీకర్ పై దాడి చేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు.

ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి స్పీకర్‌పై దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. అడ్డుకోవడానికి వెళ్తే తమపై దాడి చేశారని.. చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారన్నారు. దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని.. ఇది చంద్రబాబు చేయించిందే అని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను 10 గంటలకు పైగా విచారించిన ఈడీ.. రేపు మళ్లీ విచారణకు పిలిచిన అధికారులు

hiranjeevi vs Mohan babu | చిరంజీవితో గొడవలపై తొలిసారి నోరు విప్పిన మోహన్ బాబు

Salman Khan | సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు.. ఇంతకీ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భాయ్ అంటే ఎందుకంత కోపం ?

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News