Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentSalman Khan | సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు.. ఇంతకీ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భాయ్...

Salman Khan | సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు.. ఇంతకీ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భాయ్ అంటే ఎందుకంత కోపం ?

Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈసారి బెదిరింపులు ఫోన్‌ కాల్‌ ద్వారా కాకుండా ఈ మెయిల్ ద్వారా వచ్చాయి. అవి గ్యాంగ్‌ స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెదిరింపుల గురించి సల్మాన్ సిబ్బంది ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సల్మాన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

సల్మాన్‌ ఖాన్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే తొలిసారేమీ కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి వార్నింగ్స్ వచ్చాయి. ఒకసారి అయితే బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌ను హత్య చేసేందుకు కూడా ట్రై చేసింది. ఇప్పుడు మరోసారి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు మెయిల్ పంపించింది. మెయిల్‌ లో గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ సల్మాన్‌ తో మాట్లాడాలనుకుంటున్నట్లు మెసెజ్‌ పెట్టినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సల్మాన్‌ సిబ్బంది వివరించారు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని మెయిన్ లో వారు చెప్పినట్టు తెలుస్తోంది.

బిష్ణోయ్ గ్యాంగ్‌తో సల్మాన్ ఖాన్‌కు వివాదమేంటి?

కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌పై ఆరోపణలు రావడంతో అసలు వివాదం మొదలైంది. బిష్ణోయ్ తెగ వాళ్లు కృష్ణ జింకలను తమ ఆరాధ్య దైవంగా చూస్తారు. తమ కుల దైవంగా భావించే పవిత్రమైన జంతువును సల్మాన్ వేటాడాడు అని అతనిపై బిష్ణోయ్ తెగ వాళ్లు పగ పెంచుకున్నారు. అప్పట్నుంచి అతన్ని తమ శత్రువుగా చూస్తున్నారు. ఈ క్రమంలో 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ఖాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. కృష్ణ జింకల కేసులో నిర్దోషి అని తీర్పు వచ్చినప్పటికీ.. బిష్ణోయ్ తెగవాళ్లు మాత్రం సల్మాన్‌పై గుర్రుగానే ఉన్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా సల్మాన్‌ను చంపేందుకు కూడా యత్నించారు. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ బఠిండా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతను జైలులో ఉన్నాడు. గోల్డీ బ్రార్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్య తర్వాతే సల్మాన్‌కు బెదిరింపులు మొదలయ్యాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News