Thursday, May 30, 2024
- Advertisment -
HomeNewsInternationalViral News | కోటి రూపాయలు ఇచ్చినా మాస్క్‌ తీయనంటే తీయను.. పారిశ్రామికవేత్త ఆఫర్ తిరస్కరించిన...

Viral News | కోటి రూపాయలు ఇచ్చినా మాస్క్‌ తీయనంటే తీయను.. పారిశ్రామికవేత్త ఆఫర్ తిరస్కరించిన యువతి!

Viral News | కరోనా వచ్చిన తరువాత ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకరి ముఖాలు ఒకరికి తెలియకుండా ఫేస్‌కు మాస్క్‌లు తగిలించుకోవడం బాగా అలవాటైంది. ప్రతి పది మందిలో కనీసం ఏడుగురు మాస్క్‌తో కనిపిస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా కొంతమంది మాస్క్‌ను మాత్రం వదలడం లేదు. మాస్క్‌ తీయమన్నా తీయనంటున్నారు. ఒక యువతికి తన పక్కన కూర్చున్న పారిశ్రామిక వేత్త మాస్క్‌ తీసేస్తే లక్షల రూపాయలు ఇస్తానన్నా తీయలేదట. ఇప్పుడీ న్యూస్‌ వైరల్‌గగా మారింది.

అయితే కరోనా భయం ఇంకా పోలేదు చెప్పడానికి తాజాగా జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ. విమానంలో తన పక్కన కూర్చున్న యువతికి రూ.82 లక్షలు ఇస్తాను మాస్క్‌ తీస్తావా అని ఓ పారిశ్రామిక వేత్త కోరితే ఆమె ఎంతో సున్నితంగా ఆ ఆఫర్‌ ను తిరస్కరించింది. పూర్తి వివరాల్లోకి వెలితే..

అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త స్టీవ్ కిర్చ్ విమానంలో ప్రయాణిస్తున్నసమయంలో అతని పక్కన కూర్చొన్న ప్రయాణికురాలు మాస్క్ ధరించి ఉండడాన్ని గమనించారు. ఆమె ఎప్పటికీ మాస్క్ తీయకపోవడంతో.. స్టీవ్ కిర్చ్ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది కదా మీరు ఎందుకు మాస్క్‌ పెట్టుకున్నారు ? తీసేయొచ్చు కదా అన్నారు. ఆమె మాత్రం మాస్క్ తీసేందుకు నిరాకరించింది. స్టీవ్ కిర్చ్ ఎన్నిసార్లు అడిగినా మాస్క్ తీయలేదు. దీంతో ఆమెకు డబ్బుల ఆశ జూపాడు.

లక్షల రూపాయలు ఇస్తాను మాస్క్ తీయమని కోరాడు. అతడి ఆఫర్లకు కనీసం ఆమె స్పందించలేదు. చివరికి 100,000 డాలర్ల ఆఫర్ (రూ. 82 లక్షలు) ఇచ్చారు. కానీ ఆమె అంగీకరించలేదు. దీంతో స్టీవ్ కిర్చ్ అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని ట్టిట్టర్ వేదికగా షేర్ చేశాడు.

‘నేను డెల్టా ఫ్లైట్‌లో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నాను. ఒక మహిళ నా పక్కన కూర్చుంది. ఆమె మాస్క్ ధరించింది. ఇంకా మాస్క్ అవసరం లేదు తీసేయొచ్చు కదా అని చెప్పాను. దానికి ఆమె అంగీకరించలేదు. దీంతో నేను ఆమెను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత ఆమెకు డబ్బు ఆఫర్‌ చేసినా అంగీకరించలేదు. ఆమె దృఢ నిర్ణయం ముందు నా ఆఫర్లన్నీ విఫలమయ్యాయి. సదరు యువతి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తోంది. చివరికి ఆమె తినటానికి మాత్రం మాస్క్ తీయాల్సి వచ్చింది” అని రాసుకొచ్చాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను 10 గంటలకు పైగా విచారించిన ఈడీ.. రేపు మళ్లీ విచారణకు పిలిచిన అధికారులు

chiranjeevi vs Mohan babu | చిరంజీవితో గొడవలపై తొలిసారి నోరు విప్పిన మోహన్ బాబు

Salman Khan | సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు.. ఇంతకీ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భాయ్ అంటే ఎందుకంత కోపం ?

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News