Home Latest News Adibatla Kidnap Case | ఆదిభట్ల కిడ్నాప్ కేసులో కీలక విషయాలు బయటపెట్టిన డాక్టర్ వైశాలి.....

Adibatla Kidnap Case | ఆదిభట్ల కిడ్నాప్ కేసులో కీలక విషయాలు బయటపెట్టిన డాక్టర్ వైశాలి.. నా తల్లిదండ్రులు కూడా అలా చేయలేదు

Adibatla Kidnap Case | ఆదిభట్ల కిడ్నాప్ కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. కిడ్నాప్ కు గురైన డాక్టర్ వైశాలి మీడియా ముందు సంచలన విషయాలు బయట పెట్టారు. నవీన్ రెడ్డి తనను చిత్ర హింసలకు గురిచేశాడని తెలిపింది. అసలు నవీన్ రెడ్డితో ఎలాంటి స్నేహం లేదని, పెళ్లి చేసుకుంటానని బంధువు ద్వారా సంప్రదిస్తే ఇష్టం లేదని చెప్పినట్లు వైశాలి తెలిపింది. ఫేక్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఫోటోలు మార్పింగ్ చేశాడని, బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని వివరించింది.

‘నువ్వంటే ఇష్టం, బాగా చూసుకుంటా.. వచ్చేయ్’ అంటూ నవీన్ రెడ్డి వేధించాడని డాక్టర్ వైశాలి తెలిపింది. రాను అంటే.. ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసేవాడని చెప్పింది. శుక్రవారం కిడ్నాప్ చేసిన సమయంలోనూ తనతో దురుసుగా ప్రవర్తించినట్లు వివరించింది. ‘బలవంతంగా తీసుకెళ్లడమే కాకుండా కారులో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు, జుట్టుపట్టుకుని ముఖం మీద దాడి చేశాడు. మా తల్లిదండ్రులు కూడా అలా కొట్టలేదు. చాలా ఘోరంగా ట్రీట్ చేశాడు. నాకిష్టం లేదు అన్నా వినలేదు. నీ ఇష్టంతో సంబంధం లేదు.. నాకు దక్కకుంటే ఎవరికీ దక్కనివ్వను’ అంటూ చిత్ర హింసలకు గురిచేశాడని వివరించింది.

నా లైఫ్ ఇక్కడితో ఆగిపోతుందని బెదిరించాడంటూ వాపోయింది. తాను చెప్పినట్లు వినకుంటే మా నాన్నను చంపేస్తాని బెదరించాడని, భద్రత కల్పించాలని పోలీసులను కోరింది. కిడ్నాప్ వ్యవహారంతో కెరీర్ దెబ్బతింటోందని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరింది. అంతేకాదు.. ‘నవీన్ రెడ్డి దొరికిపోయాడు కాబట్టి కాపాడుకునేందుకు అతని తల్లి అబద్ధాలు చెబుతోంది. మహిళగా ఆలోచించాలి. నా తల్లిదండ్రులకు ఏదైనా జరిగి ఉంటే బాధ్యత ఎవరిది. నవీన్ రెడ్డితో నాకు పెళ్లి జరగలేదు. ఆ రోజున నేను ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా. కారు ఇన్సూరెన్స్ లో నా పేరు నామినీగా పెట్టాడు. దానికి నాకు ఏం సంబంధం లేదు. నేను ఎక్కడా సంతకం చేయలేదు’ అని వైశాలి మీడియాకు వివరించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Twist in Women Kidnap Case | ఆధిభట్ల యువతి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌.. తండ్రికి ఫోన్‌ చేసిన యువతి..

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Hyderabad Metro | మాకూ మెట్రో కావాలి.. హైదరాబాద్‌ ప్రజలు కొత్త డిమాండ్లు

Exit mobile version