Home Latest News Himachal Pradesh CM | హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అతనే.. ప్రియాంక గాంధీ సూచన మేరకే...

Himachal Pradesh CM | హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అతనే.. ప్రియాంక గాంధీ సూచన మేరకే ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం

Himachal Pradesh CM | హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై స్పష్టత వచ్చింది. సీఎం పోస్టుకు నలుగురు పోటీపడగా.. అధిష్ఠానం మాత్రం హిమాచల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖు ( Sukhvinder sing sukhu )ను సీఎంగా ఎంపిక చేసింది. ఉప ముఖ్యమంత్రిగా ముకేశ్ అగ్నిహోత్రిని అధిష్ఠానం ఎంపిక చేసింది. AICC ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నిర్ణయం మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సుఖ్విందర్ సింగ్ కు మద్ధతు తెలిపారు.

చివరి వరకు పీసీసీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్ ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో ఆమె మద్ధతుదారులు కాంగ్రెస్ పరిశీలకుల వాహనాలను అడ్డుకుని నినాదాలు చేశారు.

సుఖ్విందర్ సింగ్ ఇప్పటివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 1989లో కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన NSUI అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2008లో పీసీసీ కార్యదర్శిగా, 2013లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

India record victory | టీమిండియా రికార్డు విక్టరీ.. బంగ్లాదేశ్ పై 227 పరుగుల తేడాతో విజయం

Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

Ishan Kishan | ఇసాన్ కిషన్ రికార్డు డబుల్ సెంచరీ

YSRCP Twitter Account Hacked | వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. కోతి బొమ్మలు పెడుతూ ట్వీట్స్

Farmers | ఏపీలో పెరిగిన రైతు ఆత్మహత్యలు.. తెలంగాణలో తగ్గుముఖం: పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన

Exit mobile version