Home Latest News Kerala Biryani | బిర్యాని తిని 20 ఏళ్ల యువతి మృతి.. వారంలో ఇది రెండో...

Kerala Biryani | బిర్యాని తిని 20 ఏళ్ల యువతి మృతి.. వారంలో ఇది రెండో ఘటన.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

Image Source: Pixabay

Kerala Biryani | కేరళలో దారుణం జరిగింది. మండి బిర్యానీ తిన్న 20 ఏళ్ల యువతి మృతి చెందింది. ఈ ఘటన ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. ఎందుకంటే ఇటీవలే కొట్టాయం మెడికల్ కాలేజీకి చెందిన నర్సు దగ్గర్లోని ఒక హోటల్‌లో ఆహారం తిని అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఇది జరిగిన వారం వ్యవధిలోనే మరో యువతి ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఫుడ్ పాయిజన్ వల్లే యువతి మృతి చెంది ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేరళ ఆరోగ్య శాఖ విచారణకు కూడా ఆదేశించింది.

కాసర్‌గోడ్ సమీపంలోని పెరుంబళకు చెందిన అంజు శ్రీ పార్వతి ( 20 ) స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్‌లో మండి బిర్యానీ తిన్నది. ఆ తర్వాత కొద్ది సేపటికే అనారోగ్యానికి గురి కావడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 31న ఈ ఘటన జరిగింది. అయితే ఆస్పత్రిలో ఉండగానే పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కర్ణాటకలోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే శనివారం ఉదయం మృతి చెందింది. ఫుడ్ పాయిజన్ కావడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానిస్తు్న్నారు. దీనిపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫొరెన్సిక్ నివేదిక రాగానే చర్యలు తీసకుంటామని పోలీసులు తెలిపారు.

కాగా కేరళలలో వారంలో ఇద్దరు యువతులు ఇలా ఫుడ్ పాయిజన్ అనుమానాలతో ప్రాణాలు కోల్పోవడంతో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అలర్ట్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌ను ఆదేశించారు. పార్వతి తీసుకున్న ఆహారం, ఆస్పత్రిలో ఆమెకు అందించిన చికిత్స గురించి పోలీసులు, అధికారులు ఆరాతీస్తున్నారు. ఫుడ్ ఇప్పటికే సదురు హోటల్‌పై చర్యలు తీసుకున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Beauty tips | టీ, కాఫీలు తాగితే నల్లబడతారా? చర్మం నిగనిగలాడాలంటే ఏం చేయాలి?

Is eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?

Viral News | నాకు కేన్సర్ అని అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్.. డాక్టర్‌ను వేడుకున్న ఆరేళ్ల బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వైద్యుడి ట్వీట్!

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు ? ఆలయ విశేషాలేంటి.. శిల్పులు ఎవరు ?

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Exit mobile version