Home Lifestyle Devotional Chudamani temple | ఆ గుడిలో దొంగతనం చేస్తే పిల్లలు పుడతారట.. వందల ఏళ్లుగా భక్తుల...

Chudamani temple | ఆ గుడిలో దొంగతనం చేస్తే పిల్లలు పుడతారట.. వందల ఏళ్లుగా భక్తుల విశ్వాసం.. ఎక్కడ ఉంది ?

Chudamani temple in Uttarakhand where forced to steal

Chudamani temple | ఏ ఆలయంలోనైనా భక్తులు కట్నకానుకలు సమర్పించి తమ కోరికలు నెరవేర్చమని దేవుడిని వేడుకుంటారు. భక్తి శ్రద్ధలతో దేవుడికి దండం పెట్టుకుంటారు. దేవుడిని కళ్లతో చూసి తరించాలని అనుకుంటారు. కానీ ఈ ఆలయానికి వెళ్లే భక్తుల ఆలోచన, మనసంతా దొంగతనాల మీదే ఉంటదట. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ. కానీ ఇక్కడ అదే ఆచరమట. వందల ఏళ్లుగా ఇదే ఆచారం కొనసాగుతుందట.

సాధారణంగా గుడిలో ఏదైనా వస్తువు దొంగతనం చేసి తీసుకెళ్లాలంటే అపచారం అని లెంపలేసుకుంటారు. అలాంటి ఆలోచన కూడా మదిలోకి రానియ్యరు. కానీ ఉత్తరాఖండ్‌లోని ఈ ఆలయంలోనే వింత ఆచారం ఉన్నది. రూర్కీ జిల్లాలోని చూడియాలాలో చూడామణి ఆలయానికి వచ్చిన భక్తులు కచ్చితంగా దొంగతనం చేయాల్సిందేనట. ఎందుకలా అనకుంటున్నారా ? అలా చేస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

పురాతనమైన చూడామణి ఆలయం.. సంతాన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే అలా జరగాలంటే మాత్రం గుడికి వచ్చేవాళ్లు కచ్చితంగా దొంగతనం చేయాలట. అలా చేస్తే ఎవరూ అడ్డు చెప్పరు. దొంగతనం చేయమని స్వయానా పూజారులే ప్రోత్సహిస్తారు. అలా అని ఆలయంలో అమ్మవారి మెడలో ఉన్న బంగారమో.. గుడిలో ఉన్న డబ్బునో దొంగతనం చేయొచ్చు అనుకునేరు. అమ్మవారి పాదాల దగ్గర చెక్క బొమ్మలు ఉంటాయట. వాటిని ఎవరైతే దొంగతనం చేస్తారో వారికి అందమైన, ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతారని భక్తులు నమ్ముతారు. అదంతా అక్కడ పురాతన ఆచారంలో భాగంగా చేస్తారు.

చెక్క బొమ్మను దొంగిలించి ఇంటికి తీసుకెళ్లడమే కాదు.. బిడ్డ పుట్టిన తర్వాత ఆ చెక్క బొమ్మను మళ్లీ ఎక్కడి నుంచైతే తీసుకున్నారో అక్కడే పెట్టాలట. దానితో పాటు మరొక బొమ్మను కూడా తీసుకురావలన్నది ఆ ఆలయ ఆచారమట.

దీని వెనుక పెద్ద కథే ఉందిగా..

చూడామణి ఆలయంలో దొంగతానలు చేయాలన్న ఆలోచన వెనుక పురాణగాథ ఉంది. లాందౌరా రాజు ఒకరోజు అడవిలో సంచరిస్తుండగా చూడామణి ఆలయాన్ని చూసి తమకు బిడ్డను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నాడు. దీంతో అమ్మవారు మాయమై చెక్కరూపంలో దర్శనమిచ్చింది. ఆ చెక్క బొమ్మను తీసుకొని ఇంటికి వెళ్లిన రాజు దంపతులకు కొన్నాళ్ల తర్వాత పండంటి బిడ్డ పుట్టాడు. తెగ సంతోషపడిన రాజు.. వెంటనే సతీసమేతంగా ఆలయానికి వెళ్లి తాను తీసుకెళ్లిన చెక్కబొమ్మతో పాటు మరో చెక్కబొమ్మనూ అమ్మవారికి సమర్పించాడట. అలా మొదలైన ఆచారం ఇప్పటికీ అలానే కొనసాగుతుందని చూడామణి ఆలయంలో పూజారులు చెబుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Viral News | నాకు కేన్సర్ అని అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్.. డాక్టర్‌ను వేడుకున్న ఆరేళ్ల బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వైద్యుడి ట్వీట్!

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు ? ఆలయ విశేషాలేంటి.. శిల్పులు ఎవరు ?

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?


Exit mobile version