Home Lifestyle Health Beauty tips | టీ, కాఫీలు తాగితే నల్లబడతారా? చర్మం నిగనిగలాడాలంటే ఏం చేయాలి?

Beauty tips | టీ, కాఫీలు తాగితే నల్లబడతారా? చర్మం నిగనిగలాడాలంటే ఏం చేయాలి?

Image by tirachardz on Freepik

Beauty tips | టీ తాగితే నల్లబడతారని చెబుతుంటారు. అందుకే కొంతమంది టీ, కాఫీలకు దూరంగా ఉంటారు. మరికొందరేమో కేవలం పాలు మాత్రమే తాగుతారు. మరి నిజంగానే టీ, కాఫీలు తాగితే చర్మం నల్లగా మారిపోతుందా? ఛాయ్‌కి, మేని ఛాయకు సంబంధమేంటి? ఒకసారి తెలుసుకుందాం..

టీ తాగడం వల్ల చర్మం నల్లగా మారిపోతుందనేది ఒక అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ, కాఫీ లేదా కెఫిన్‌ ఎక్కువగా ఉండే ద్రావణాలను చర్మాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయవని అంటున్నారు. రంగు అనేది చర్మం ఆకృతి, రూపురేఖల మీదే ఆధారపడి ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల నిర్జీవంగా తయారవుతుంది. అలాగే రోజులో రెండు మూడు సార్లు కంటే ఎక్కువగా టీ, కాఫీలు తాగే వారిలో మాత్ర చర్మం నల్లబడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చర్మం నల్లబడటానికి టీ, కాఫీలు మాత్రమే కాకపోవచ్చని.. నిద్రలేమి, ఒత్తిడి, ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు.

Beauty tips | చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

చర్మం అనారోగ్యానికి గురవడానికి చాలా కారణాలు ఉంటాయి. సూర్యరశ్మి, కాలుష్యం ఇవన్నీ దాని మీద ప్రభావం చూపిస్తుంటాయి. చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడాలంటే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. మోతాదుకు మించి టీ, కాఫీలు తాగొద్దు. ముఖంపై మొటిమలు, జిడ్డు రాకుండా ఉండాలంటే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. అతి వేడి, అతి చల్లని ఆహారం తీసుకోవద్దు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Home Remedies for Cold | చలికాలంలో ముక్కు కారుతుందా? ఈ చిట్కాలతో జలుబు నుంచి ఉపశమనం పొందండి

Bone Health | ఎముకలు బలంగా కావాలంటే.. రోజూవారీ భోజనంలో వీటిని తప్పనిసరి చేసుకోవాలి!

Postpartum Hair loss | డెలివరీ తర్వాత జుట్టు ఊడిపోతుందా? ఈ టిప్స్‌ మీకోసమే..

Stretch marks after pregnancy | డెలివరీ తర్వాత పొట్టపై మచ్చలు అలాగే ఉంటున్నాయా?

Is eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?

Exit mobile version