Thursday, April 25, 2024
- Advertisment -
HomeNewsInternationalPavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా...

Pavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా కుట్ర కోణం ఉందా?

Pavel Antov | ఒకరు రష్యాకు చెందిన ఎంపీ.. మరొకరు ఆయన పార్టీకే చెందిన కీలక నేత. ఇద్దరూ రష్యా నుంచి భారత్‌కు వచ్చారు. ఒడిశాలోని రాయగడలో ఒకే హోటల్‌లో దిగారు. కానీ రెండు రోజుల వ్యవధిలో అనుమానాస్పదంగా మరణించారు. అలా అని వాళ్లేమీ సాధారణ వ్యక్తులు కాదు. ఒకరు రష్యా ఎంపీ పావెల్‌ ఆంటోవ్‌.. ఆ దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు. మరొకరు ఆయన పార్టీకే చెందిన నేత. పావెల్‌కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు వీరిద్దరి మరణం మిస్టరీగా మారింది.

పావెల్‌ ఆంటోవ్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నిర్ణయాలను వ్యతిరేకించే నేతల్లో ఒకరు. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. పుతిన్‌ విదేశాంగ విధానాలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించే నేత. పుట్టినరోజు వేడుకల కోసం రష్యా నుంచి ఆంటోవ్‌తో పాటు వ్లాదిమిర్‌ బైదెనోవ్‌ ఒడిషా వచ్చారు. రాయగడలోని హోటల్‌లోఈనెల 21న దిగారు. అయితే ఈ నెల 22న వ్లాదిమిర్‌ బైదెనోవ్‌ అనుమానాస్పత రీతిలో హోటల్‌లో మరణించారు. అదే హోటల్‌లో ఈనెల 24న ఆంటోవ్‌ కూడా మూడో అంతస్తులోని తన గది కిటికీ నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఒకే హోటల్‌లో అనుమానాస్పద రీతిలో మరణించడం మిస్టరీగా మారిపోయింది.

అయితే బైదెనోచ్‌ గుండెపోటుతో మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని రాయగడ ఎస్పీ వివేకానంద శర్మ తెలిపారు. ఆయన మృతదేహానికి కుటుంబసభ్యుల అనుమతితో అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. బైదెనోచ్‌ మృతిని తట్టుకోలేకనే స్నేహితుడు ఆంటోవ్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ వెల్లడించారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఆంటోవ్‌ మూడో అంతస్తు నుంచి కింద పడటం వల్ల శరీరంలో అంతర్గతంగా గాయాలైనట్లు తేలిందన్నారు. ఆ గాయాలవల్లే ఆంటోవ్‌ మృతి చెందినట్లు పోస్టుమార్టమ్‌ నివేదికలో పేర్కొన్నారు. కానీ వీరిద్దరి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదే హోటల్‌లో మరో ఇద్దరు రష్యన్లు కూడా ఉన్నారని, వారికి రష్యా దౌత్య కార్యాలయం నుంచి అనుమతి పత్రాలు వచ్చిన వెంటనే స్వదేశానికి వెళ్లిపోతారని హోటల్‌ యజమాని కూడా చెప్పారు.

పుతిన్‌ను విమర్శించేవాళ్లను మూడోకంటికి తెలియకుండా అత్యంత రహస్యంగా అంతమొందిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పోలీసుల విచారణలో వీరిద్దరి మృతిలో కుట్ర కోణం బయటపడలేదని రష్యా దౌత్య కార్యాలయం స్పష్టం చేయడం గమనార్హం.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

Corona cases | రాబోయే 40 రోజులు కీలకం.. భారత్‌లో భారీగా కరోనా కేసులు పెరిగే ఛాన్స్!

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News