Home Lifestyle Health Heart Attack | గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలేంటి.. ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏం...

Heart Attack | గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలేంటి.. ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

Heart Attack | ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న సమస్య గుండెపోట్లు. చిన్నా పెద్దా వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా వచ్చి ప్రాణాలను హరిస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా తర్వాత గుండెపోటు ముప్పు పెరిగే అవకాశం ఉంటుందని చాలా వరకు అధ్యయనాల్లో తేలింది. ఇప్పుడదే నిజమన్నట్లుగా కాలేజీ పిల్లల నుంచి ఫిట్‌గా ఉంటున్న వాళ్లు కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఇంతలా భయపెడుతున్న గుండెపోటును ముందే గుర్తించొచ్చా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్నుంచి బయడపడోచ్చో ఓసారి తెలుసుకోండి..

  • సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు యువతలో ఛాతిలో నొప్పి రాదు. సడెన్‌గా గుండెపోటు వచ్చేస్తుంది. కొంత మందిలో మాత్రమే ఛాతి మధ్యలో మంటగా, బరువుగా ఉంటుంది.
  • ఎడమ చేయి లాగడం, భుజాలు నొప్పిగా ఉండటం.. మెడనొప్పి, వెన్ను నొప్పి కూడా గుండె జబ్బులను సూచిస్తాయి.
  • అకస్మాత్తుగా చెమటలు పట్టడం, కళ్లు తిరిగినట్లు అనిపించి వాంతులు అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. చిన్న చిన్న పనులకే నీరసంగా అనిపిస్తుంది.
  • కొద్ది దూరం నడిచినా ఆయాసం వస్తుందంటే గుండె విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం.
  • చాలా మంది గుండెనొప్పిని గ్యాస్ట్రిక్‌ సమస్య, కండరాల సమస్యగా పొరబడుతుంటారు. ఇలాంటి సమయంలో ఎసిడిటీకి మందులు వాడినా నొప్పి తగ్గ్టట్లేదంటే ఈసీజీ తీపించుకోవాలి.

గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

  • గుండెపోటు రాకుండా జాగ్రత్త పడాలంటే తక్షణం చేయాల్సింది ధూమపానం మానేయడం. రెడ్‌ మీట్‌ అంటే బీఫ్‌, మటన్‌ తినడాన్ని తగ్గించాలి.
  • తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడంతో పాటు ఉప్పు, నూనె వాడకాన్ని చాలా వరకు తగ్గించాలి.
  • జంక్‌ఫుడ్స్‌, ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలను ఎక్కువగా తినకూడదు. బరువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం మరచిపోవద్దు.
  • మితిమీరిన వ్యాయామం చేయకూడదు. ముఖ్యంగా యోగా, ధ్యానం చేస్తే ఇంకా బెటర్‌.
  • రోజుకు కనీసం అరగంట వాకింగ్‌ చేయడం చేయాలి. వీలైతే స్విమ్మింగ్‌ చేస్తే శరీరం హుషారుగా ఉంటుంది. ఎక్కువ కేలరీలు ఖర్చయ్యే ఛాన్సు ఉంటుంది.
  • షుగర్‌, కొలెస్ట్రాల్‌ పరీక్షలు ఎప్పటికప్పుడు చేపించుకోవడంతో పాటు నియంత్రణలో ఉంచుకోవాలి. బీపీ ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి.

    Follow Us :  Google News, FacebookTwitter

    Read More Articles:

    Rahul Gandhi | ఆ సమయంలో నన్ను చంపేసేవారమో.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

    Emoji | ఎమోజీల ట్రెండ్‌ ఎలా మొదలైంది? అవి పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

    First Video on Youtube | యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటో తెలుసా

    CRED CEO | ఆ కంపెనీ సీఈవో జీతం కేవలం 15 వేలే.. ఎందుకలా?

    Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

    Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

    Exit mobile version