Home Lifestyle Do you know Salt | ఉప్పు అప్పుగా ఇస్తే గొడవలు వస్తాయా?

Salt | ఉప్పు అప్పుగా ఇస్తే గొడవలు వస్తాయా?

Image by Racool_studio on Freepik

Salt | కిచెన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు ఉప్పు. ఇది ఉంటేనే కూరలకు రుచి వస్తుంది. ఉప్పు లేకుండా ఎన్ని దినుసులు వేసిన కూరకు టేస్ట్ రాదు. అందుకే ఉప్పును వంటింట్లో చాలా ప్రత్యేకంగా చూస్తారు. అయితే ఇలాంటి ఉప్పు కిచెన్‌లో ఎప్పుడూ నిల్వ ఉండాలంట. అంతేకాదు ఇతరులకు అప్పుగా కూడా ఇవ్వద్దని అంటారు. మరి ఎందుకు ఉప్పును అప్పుగా ఇవ్వద్దని అంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

క్షీరసాగరమదనం సమయంలో లక్ష్మీదేవి జన్మించిన పాల సముద్రం నుంచే రాతి ఉప్పు పుట్టింది. అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తారు. అందుకే ఉప్పును దానం చేయవచ్చు గానీ అప్పుగా ఇవ్వకూడదని చెబుతుంటారు. ఉప్పును అప్పుగా ఇవ్వడం అంటే మన ఇంటి లక్ష్మీదేవిని ఇతరుల చేతిలో పెట్టినట్టేనని అంటారు. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత అయితే కనీసం కుటుంబ సభ్యుల చేతికి కూడా ఉప్పును ఇవ్వరు. ఒకసారి చేజారిన సంపద మళ్లీ తిరిగి రావడమన్నది కష్టం. అందుకే ఉప్పు చేతికి తీసుకున్న తర్వాత.. ఇచ్చిన వాళ్లతో కలహాలు ఏర్పడతాయన్న భావన ఏర్పడింది. అందుకే ఉప్పును అప్పుగా ఇవ్వవద్దని చెబుతారు. ఒకవేళ అప్పుగా ఇవ్వాల్సి వస్తే.. వారి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకోవాలని అంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

Exit mobile version